బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయండి 

12 Dec, 2021 03:43 IST|Sakshi

ప్రధానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ లేఖ  

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వెంటనే ఆ బ్లాకులను సింగరేణి సంస్థకే అప్ప గించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేం ద్రాన్ని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.

కోయ గూడెం, సత్తుపల్లి, శ్రావణపల్లి, కల్యాణి బ్లాక్‌ల వేలాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలుగుతోందని, ఈ వేలం ద్వారా తమ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందనే ఆందోళనలో కార్మికలోకం ఉందని పేర్కొన్నారు.  

మేమొస్తే్త ఎస్సీల్లోకి దళిత క్రైస్తవులు 
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేరుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. టీపీసీసీ మైనార్టీ సెల్‌ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న రేవంత్‌.. కేక్‌ కట్‌ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఉపాధ్యాయుల విభజనలో స్థానికతకు ప్రాధా న్యం ఇవ్వాలని, ఆ మేరకే ఉమ్మడి జిల్లాల్లోని ఉపాధ్యాయులను నూతన జిల్లాలకు కేటాయించాలని రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు రేవంత్‌ను కలసి తమ సమస్యలను వివరించారు.   

మరిన్ని వార్తలు