వ్యాక్సిన్‌ వేయించుకున్న మంత్రి కేటీఆర్‌

20 Jul, 2021 20:39 IST|Sakshi
వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న విషయాన్ని ట్వీట్‌ చేస్తూనే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బదులు ఇచ్చారు. ఇన్నాళ్లు తాను ఎందుకు వ్యాక్సిన్‌ వేసుకోలేదో వివరణ ఇచ్చారు. డాక్టర్‌ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం నర్సు కిరణ జ్యోతి మంత్రికి వ్యాక్సిన్‌ వేశారు. ఈ సందర్భంగా ఈ రోజు వ్యాక్సిన్‌ వేసుకున్నా అంటూ ఫొటోను మంత్రి ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం మరో ట్వీట్‌ చేశారు. వ్యాక్సిన్‌ ఎందుకు వేయించుకోలేదో అని అడుగుతున్న వారికి మంత్రి సమాధానమిచ్చారు. ‘ఏప్రిల్‌ మధ్యలో నేను కరోనా బారిన పడడంతో ఆలస్యంగా వ్యాక్సిన్‌ వేయించుకున్నా. కేంద్ర వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం కరోనా బారిన పడిన మూడు నెలల అనంతరం వ్యాక్సిన్‌ వేయించుకోవాలి’ అని ట్వీట్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌కి ఇది మొదటి డోస్‌. మీరు వ్యాక్సిన్‌ వేయించుకున్నారు... మరి మీ నాన్న సీఎం కేసీఆర్‌ ఎప్పుడు వేసుకుంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు