సీడీపీ నిధులు రూ.382 కోట్లు విడుదల 

25 Aug, 2021 01:58 IST|Sakshi

ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గానికి రూ. 2.5కోట్లు   

సాక్షి, హైదరాబాద్‌: నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) కింద రూ.382.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గానికి రూ. 2.50 కోట్లను కేటాయిస్తూ ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్థిక ఏడాదిలో రూ.800 కోట్లను సీడీపీ కింద కేటాయించగా, అందులో రూ.400 కోట్లను మొదటి రెండు త్రైమాసికాలకు ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా 119 మంది ఎమ్మెల్యేలు, 34 మంది ఎమ్మెల్సీలకు మొత్తం రూ. 382.50 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

మరిన్ని వార్తలు