ఉచిత రేషన్‌ బియ్యానికి మంగళం 

2 May, 2022 01:34 IST|Sakshi

ఈ నెల నుంచి రేషన్‌ దుకాణాల్లో రూపాయికి కిలో బియ్యం 

ఇంతకుముందే ఉచిత బియ్యాన్ని సెప్టెంబర్‌ వరకు పొడిగించిన కేంద్రం!

సాక్షి, హైదరాబాద్‌:  కరోనా తొలివేవ్‌ నాటి నుంచి అమలవుతున్న ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ఈ నెల నుంచి రేషన్‌ దుకాణాల్లో రూపాయికి కిలో బియ్యం పథకం తిరిగి అమలుకానుంది. ఈ మేరకు పౌర సరఫరాల కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లుగా ప్రతి లబ్ధిదారుకు 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందగా.. ఇక నుంచి రూపాయికి కిలో చొప్పున ఆరు కిలోల బియ్యం మాత్రమే అందనుంది.

అంత్యోదయ (ఏఎఫ్‌ఎస్‌సీ) లబ్ధిదారులకు ఒక్కో కార్డుపై రూపాయికి కిలో చొప్పున 35కిలోల బియ్యం ఇస్తారు. అన్నపూర్ణ కార్డు దారులకు మాత్రం కార్డుకు 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేస్తారు. కాగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ జరగనుంది. 

కేంద్రం సెప్టెంబర్‌ వరకు పొడిగించినా.. 
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్‌లో ఉచిత రేషన్‌ పంపిణీ పథకాన్ని ప్రా రంభించింది. అప్పటి నుంచి దశలవారీగా పొడిగిస్తూ వచ్చింది. తాజాగా గత మార్చి నెలాఖరులోనే మరో ఆరు నెలలు పొడిగించింది. సెప్టెంబర్‌ వరకు ఉచిత బి య్యం అందాలి. అయితే ఏప్రిల్‌లో పది కిలో ల చొప్పున ఉచిత బియ్యం ఇచ్చిన రాష్ట్ర స ర్కారు.. మే నుంచి రూపాయికి కిలో బియ్యా న్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

మరిన్ని వార్తలు