నాలుగు స్థానాలు గులాబీ ఖాతాలోకే..!

22 Sep, 2020 09:38 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి: రామగుండం నగరపాలకసంస్థ కో ఆప్షన్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం లాంఛనమే కానుంది. కోర్టు కేసుల కారణంగా ఇటీవల వాయిదా పడ్డ ఎన్నికను మంగళవారం సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్నారు. మొత్తం ఐదు స్థానాలకు గాను ఒక్క మైనార్టీ జనరల్‌ స్థానానికి మాత్రమే పోటీ  ఏర్పడడంతో ఎన్నిక అనివార్యమైంది. కాని బల్దియాలో ప్రస్తుతం పార్టీల బలాబలాలు చూస్తే టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి ఐదు కో ఆప్షన్‌ స్థానాలు వెళ్లడం లాంఛనమే. 

నేడు ఎన్నిక
కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డ రామగుండం నగరపాలకసంస్థ కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక మంగళవారం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగే ప్రత్యేక సమావేశంలో కార్పొరేటర్లు ప్రత్యక్ష పద్ధతిన హాజరై సభ్యులను ఎన్నుకుంటారు. కాగా మొత్తం ఐదు స్థానాలకు గాను నాలుగింటికి కేవలం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మైనార్టీ జనరల్‌ స్థానానికి టీఆర్‌ఎస్‌తో పాటు, కాంగ్రెస్, మరో అభ్యర్థి పోటీ ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది.

కరోనా కారణంగా ఈ నెల 1న టెలి, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నిక నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కాని ఈ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ మహాంకాళి స్వామి, మైనార్టీ కో ఆప్షన్‌ పదవికి పోటీ చేస్తున్న సైమన్‌రాజ్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే ఇవ్వడంతో అప్పట్లో ఎన్నిక నిలిచిపోయింది. తిరిగి ప్రత్యక్ష పద్ధతిలోనే కోఆప్షన్‌ ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో మంగళవారం ప్రత్యక్ష పద్ధతిలో (చేతులెత్తే) ఎన్నికను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 

అధికార పార్టీదే హవా
నగరపాలక సంస్థలో ఈ ఏడాది జనవరి 22న ఎన్నికలు జరుగగా అదే నెల 25న ఫలితాలు వెలువడ్డాయి. 50 డివిజన్లకు గాను టీఆర్‌ఎస్‌ 18, కాంగ్రెస్‌ 11, బీజేపీ 6, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ 9, ఆరు స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. అనంతర రాజకీయ పరిణామాలతో ఫార్వర్డ్‌బ్లాక్‌కు చెందిన తొమ్మిది మంది, బీజేపీకి చెందిన ఇద్దరు, ఇండిపెండెంట్లు ఆరుగురు టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారు. దీంతో టీఆర్‌ఎస్‌ బలం 35కి చేరింది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే కో ఆప్షన్‌ కూడా వెళ్లనుంది.

మైనార్టీ జనరల్‌కు పోటీ
ఐదు కో ఆప్షన్‌ స్థానాల్లో కేవలం మైనార్టీ జనరల్‌ స్థానానికే పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ నుంచి మహ్మ ద్‌ రఫీ, కాంగ్రెస్‌ నుంచి ఫజల్‌ బేగ్, బొల్లెద్దుల సైమన్‌రాజు పోటీలో ఉన్నారు. 35 మంది కార్పొరేటర్లు చేజారకుండా స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చంద ర్‌ ఇప్పటికే మంతనాలు పూర్తి చేశారు. అ ద్భుతం జ రిగితే తప్ప ఐదవ స్థానం కూడా టీఆర్‌ఎస్‌ ఖాతా లోకి వెళ్లడం ఖాయంగా మారింది. ఇక కాంగ్రెస్‌ మద్ద తు పలికిన బేగ్‌కు, అదనంగా ఓట్లు పడుతా యా అ నే ఆసక్తి ఏర్పడింది. కాగా ఎవరికి మద్దతు ఇ వ్వాలో ఇంకా బీజేపీ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు