బస్సే షెల్టర్‌.. డిపో మేనేజర్‌ వినూత్న ఆలోచన

17 Apr, 2021 10:53 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌ చైన్‌గేట్‌: ఆలోచన ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని అంటారు. ఆ మాటలను నిజం చేస్తూ చూపించారు ఆర్టీసీ అధికారులు. బస్సు కోసం ఎదురు చూసే ప్రయాణికులు ఎండలో నిలబడకుండా నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఓ అధికారి వినూత్నంగా ఆలోచించి ఓ బస్సునే తాత్కాలిక షెల్టర్‌గా వినియోగిస్తున్నారు.

పట్టణంలోని మంచిర్యాల చౌరస్తాలో ఎలాంటి షెడ్లు లేకపోవడంతో అటు వైపు వెళ్లే ప్రయాణికులు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. దీనిని గమనించిన డిపో మేనేజర్‌ ఆంజనేయులు ఓ బస్సును తాత్కాలిక షెల్టర్‌గా ఏర్పాటు చేయించారు. బస్సును ప్రతిరోజు శానిటైజర్‌ చేయించి శుభ్రంగా ఉంచుతున్నామని, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశామని మేనేజర్‌ తెలిపారు. హైదరాబాద్, నిజామాబాద్‌ వైపు వెళ్లే ప్రయాణికులు ఈ బస్సులో కూర్చొని కాసేపు సేద తీరుతున్నారు.

( చదవండి: కరీంనగర్‌లో ఈటల రాజేందర్‌కు నిరసన సెగ

మరిన్ని వార్తలు