పాతబస్తీ: 70 కోట్లు చేసే భూమిపై ఘర్షణ

16 Dec, 2020 14:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని ఉప్పుగూడ కాళికామాత దేవాలయంకు సంబంధించిన 24, 25, 26 సర్వే నెంబర్లలోని రూ. 70 కోట్ల విలువ చేసే 7 ఎకరాల 13 గుంటల స్థలం ఘర్షణకు దారితీసింది. దేవాదయశాఖకు చెందిన స్థలాన్ని.. ఓ వ్యక్తి ఆ స్థలం నాదంటూ సిటీ సివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ అర్డర్లు తీసుకోవడం, ఘటనా స్థలంలో పోలీసుల సమక్షంలో నిర్మాణాలు చేపడుతుండడంతో బీజేపీ నాయకులు స్థానికులతో కలిసి అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకుల్ని, మహిళల్ని, వృద్ధుల్ని ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాల్లోకి తీసుకెళ్లడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

కాగా, 1951లో ఈ స్థలాన్ని దేవాదయశాఖ అధీనంలోకి తీసుకొని ఇప్పటివరకు 11 సార్లు వేలం పాట వేస్తున్నట్లు ప్రకటనలు చేశారు. ఒకసారి వేలం పాట కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో వేలం పాటలో ధర తక్కువగా వచ్చిందని సీపీఐ నాయకులు దేవాదయ శాఖ ముందు ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించడంతో వేలం పాట రద్దు చేశారు. 

అప్పటి నుంచి రాని వ్యక్తి తాజాగా ఆ స్థలం ఆలయ ట్రస్టీ తనకు అమ్మిందని ఆలయ భూముల్లో చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మిస్తుండగా బీజేపీ నాయకులు, స్థానికులు అడ్డుకున్నారు. నా భూముల్లో నేను నిర్మాణాలు చేసుకుంటుంటే స్థానికులు అడ్డు పడుతున్నారంటూ ఆ వ్యక్తి సిటీ సివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని అర్డర్లు తీసుకొచ్చారు. దీంతో బుధవారం పోలీసులు పెద్ద ఎత్తున ఆలయస్థలం వద్దకు చేరుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు స్థానికులతో కలిసి అక్కడకు చేరుకొని అడ్డుకోవడంతో ఘర్షణకు దారితీసింది. చదవండి: (నిజాంపేట్‌లో‌ అపార్ట్‌మెంట్లకు ఏమైంది!)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు