నీట్‌ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల

21 Nov, 2021 01:09 IST|Sakshi

వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన కాళోజీ వర్సిటీ 

సాక్షి, హైదరాబాద్‌: నీట్‌–2021 యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులను శనివారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ జాబితాను వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ర్యాంకుల జాబితా సమాచారం నిమిత్తమేనని, వర్సిటీకి దరఖాస్తు చేసిన తర్వాతే మెరిట్‌ జాబితా విడుదల చేస్తామని వర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి.

కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ముందుగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని, అభ్యర్థుల దరఖాస్తుల ఆధారంగా ధ్రువపత్రాలను పరిశీలించి ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా విడుదల చేసిన తర్వాత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వివరించింది. నీట్‌–21 యూజీ అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం ఇంకా నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు.  అడ్మిషన్ల షెడ్యూల్‌ ఖరారైన తర్వాత కాళోజీ వర్సిటీ కౌన్సెలింగ్‌  చేపట్టనుంది. 

నీట్‌ కటాఫ్‌ స్కోర్‌ వివరాలు: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి 50 పర్సంటైల్, కట్‌ ఆఫ్‌ స్కోర్‌ 138 మార్కులు 
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40 పర్సంటైల్, కట్‌ ఆఫ్‌ స్కోర్‌ 108 మార్కులు 
పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 పర్సంటైల్, కట్‌ ఆఫ్‌ స్కోర్‌ 122 మార్కులు   

మరిన్ని వార్తలు