అధిష్టానంపై ‘గోరంట్ల’ తీవ్ర అసంతృప్తి

20 Aug, 2021 01:49 IST|Sakshi

టీడీపీకి రాజీనామాపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి  గోరంట్ల రాజీనా మా చేస్తున్నట్లు గురువారం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఈ సమాచారంపై మీడియా వద్ద స్పందించేం దుకు గోరంట్ల తొలుత నిరాకరించారు. సీని యర్‌ అయిన తనను పార్టీ అధిష్టానం అవ మానానికి గురిచేస్తోందనే ఆవేదనతో రాజమ హేంద్రవరంలో ఇంటికే పరిమిత మయ్యారు.

విషయం తెలుసుకుని ఆ పార్టీ మరో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీమంత్రి జవహర్‌ ఆయనను  బుజ్జగించే ప్రయత్నం చేశారు. చంద్రబాబుతో మాట్లాడి   సర్దుబా టు చేస్తామని, గోరంట్ల రాజీనామా ప్రస్తావన రాలేదని,  అసంతృప్తి మాత్రమేనని చిన రాజప్ప, జవహర్‌ ప్రకటించారు. అయినా.. అలక వీడని గోరంట్ల పార్టీలో తాను ఒంటరినని, చంద్రబాబును మాత్రం కలిసేది లేదని, నాయకులే కలుస్తారని స్పష్టంచేశారు. పార్టీ పదవులు, పీఏసీ చైర్మన్‌లో ప్రాధాన్యం ఇవ్వక పోవడంతో చంద్రబాబుపై గోరంట్ల తీవ్ర అసంతృప్తితో రాజీనామాకు సిద్ధపడుతు న్నట్లు సమాచారం. దీనిపై గోరంట్ల స్పందిస్తూ.. రాజీనామా విషయంపై వారం, పది రోజుల్లో స్పష్టతనిస్తానని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు