యాదాద్రి ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌కు ట్రయల్‌రన్‌  

5 Mar, 2022 03:28 IST|Sakshi
ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో భాగంగా ట్రయల్‌ రన్‌

యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఈసీఐఎల్‌ కంపెనీ ప్రతినిధుల బృందం ఆన్‌లైన్‌లో టికెట్‌ బుకింగ్‌ ప్రక్రియపై ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఆన్‌లైన్‌లో టికెట్‌ బుకింగ్‌ చేసుకున్నప్పుడు ఎంట్రీ దర్శనం టికెట్‌ దేవస్థానం అధికారులు నిర్ణయించిన ధరతో వస్తుంది.

ఇందులో దర్శనానికి సంబంధించి రిపోర్టింగ్‌ తేదీ, సమయం, ఏ గేట్‌ వద్ద రిపోర్ట్‌ చేయాలి, బుకింగ్‌ నంబర్, బుకింగ్‌ డేట్, చెల్లించిన నగదు, ఆలయసేవలు, ఆలయానికి సంబంధించిన ఫోన్‌ నంబర్, ఆధార్, పేరు క్యూర్‌ కోడ్‌తో ఉండనున్నాయి. ప్రధానాలయం ప్రారంభం అయిన తర్వాత ఎన్ని రోజులకు ఈ టికెట్‌ బుకింగ్‌ విధానం ప్రవేశపెడతారు, ఏ వెబ్‌సైట్‌లో వీటిని వినియోగించాలనే అంశాలను అధికారులు నిర్ణయించాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు