‘దళితబంధు’ పేరుతో వంచన

2 Oct, 2021 03:39 IST|Sakshi
షెట్లూర్‌లో నీట మునిగి చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న షర్మిల  

‘జుక్కల్‌ దళితభేరి’ సభలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల 

ఇసుక మాఫియాపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌ 

సాక్షి, కామారెడ్డి: దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు దళితబంధు పేరుతో మరోసారి వారిని వంచిస్తున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరో పించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలం ఖండేబల్లూర్‌లో శుక్రవారం నిర్వహించిన ‘జుక్కల్‌ దళితభేరి’సభలో ఆమె మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకపోవడం మూలంగా ఎకరాకు రూ.10 లక్షల చొప్పున రూ.30 లక్షలు ప్రభుత్వం బాకీ పడిందని, భూమి ఇచ్చి ఉంటే గడచిన ఏడేళ్లలో కనీసం రూ.20 లక్షల ఆదాయం వచ్చేదని, వీటన్నింటిని కలిపితే ప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.

ఈ నేపథ్యం లో ప్రభుత్వం ఇచ్చే రూ.పది లక్షలు తీసుకుని మిగతాడబ్బుల కోసం పోరాడాలని ఆమె పిలుపునిచ్చా రు. తాతల కాలం నుంచి దళితులు సాగు చేసుకుం టున్న భూములకు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పట్టాలు ఇచ్చారని, కేసీఆర్‌ ప్రభుత్వం వాళ్లకు పాసుపుస్తకాలు ఇవ్వకుండా భూములు గుంజుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

దళితులంటే సీఎంకు పట్టింపు లేదు...
సీఎం కేసీఆర్‌కు దళితులంటే పట్టింపులేదని, ఇసుక అక్రమరవాణాపై ప్రశ్నించిన పాపానికి దళిత యువకులను చితకబాది జైల్లో వేశారని, దళితమహిళలను చంటి బిడ్డలతోసహా జైలుకు పంపించార ని షర్మిల విమర్శించారు. రాష్ట్రమంతటా  రూ.వందల కోట్ల ఇసుక దందా నడుస్తోందని ఆరోపించా రు. మంజీరలో ఇసుకను అడ్డగోలుగా తవ్వడం వ ల్లే నలుగురు ప్రాణాలు కోల్పోయారని, ఇసుక మా ఫియాలో టీఆర్‌ఎస్‌ నేతలకు వాటాలున్నాయని ఆరోపించారు.

ఇసుక మాఫియాపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.  అంతకుముందు బిచ్కుంద మండలంలోని షెట్లూర్‌లో ఇటీవల నీటమునిగి చనిపోయినవారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. 

మరిన్ని వార్తలు