900 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

15 Aug, 2021 01:08 IST|Sakshi
గుజరాత్‌కు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టుకున్న పౌరసరఫరాల శాఖ అధికారులు

జహీరాబాద్‌: అక్రమంగా తరలిస్తున్న 900 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలోని సత్వార్‌ గ్రామ సమీపంలోని కోహినూర్‌ దాబా వద్ద బియ్యం లారీలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పౌరసరఫరాల అధికారులు.. పోలీసు, విజిలెన్స్‌ అధికారుల సహాయంతో తనిఖీ చేయగా మూడు లారీల్లో 900 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం అక్రమంగా హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాలను సీజ్‌ చేసి ఎస్‌డబ్ల్యూసీ గోదాముకు తరలించారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా బియ్యం లోడ్‌ చేసి ఉన్నందున ఓ లారీ డ్రైవర్‌ గుల్జార్, యజమాని ఇర్ఫాన్, మరో లారీ డ్రైవర్‌ అవేష్‌జీ, యజమాని ఇస్మాయిల్‌బాయ్, మరో లారీ డ్రైవర్‌ షకీల్‌ అహ్మద్, యజమాని ఇస్మాయిల్‌ మతకియాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు సురేశ్‌ కుమార్, ఎండీ షఫీ, శ్రీనివాస్, విజిలెన్స్‌ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు