కేజీహెచ్‌లో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రారంభం

9 Nov, 2023 00:22 IST|Sakshi
సోలార్‌ ప్రాజెక్టును పరిశీలిస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున, అధికారులు

మహారాణిపేట: కేజీహెచ్‌ సీఎస్సార్‌ బ్లాక్‌లో నిరంతర వెలుగుల కోసం ఏర్పాటు చేసిన నూతన సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు వైద్యసేవలతో పాటు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. దీనిలో భాగంగానే ఆర్సెలార్‌ మిట్టల్‌ సంస్థ సీఎస్సార్‌ నిధులు రూ.50 లక్షలతో 120 కేవీ సామర్ధ్యం గల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్సెలార్‌ మిట్టల్‌ సంస్థ సౌజన్యంతో విక్టోరియా ఆస్పత్రిలో త్వరలో రూ.50 లక్షలతో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నామని, మరో రూ.50లక్షల నిధులతో చిన్నపిల్లల వసతి గృహాలను కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. అనంతరం అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం సందర్భంగా విభాగంలోని వైద్యులకు అభినందనలు తెలిపారు. లయన్స్‌ క్లబ్‌ సహకారంతో కేజీహెచ్‌లోని వివిధ వార్డుల్లో రూ. 50 వేలు విలువ గల శాశ్వత బెంచీలను కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున ప్రారంభించారు.

కార్యక్రమంలో కేజీహెచ్‌ సూపరిండెంటెంట్‌ డాక్టర్‌ పి.అశోక్‌ కుమార్‌, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజు, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్‌ రాధాకృష్ణ, డాక్టర్‌ పద్మజ, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ వాసుదేవ, ఆర్‌ఎంవో డాక్టర్‌ జగదీష్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ ఈడీ ఎం.రవీంద్రనాథ్‌, హెచ్‌ఆర్‌ డి.ఎస్‌.వర్మ, ఈడీ శ్రీనివాస్‌ కుమార్‌, లయన్స్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌, లయన్స్‌ క్లబ్‌ వైస్‌ గవర్నర్‌ సూర్య ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు