థాయ్‌ ప్రిన్స్‌కి తీవ్ర అ‍స్వస్థత.. కోలుకోవాలని ప్రజలంతా...

19 Dec, 2022 16:58 IST|Sakshi

థాయ్‌లాండ్‌ రాజు వజిరాలాంగ్‌కార్న్‌ పెద్ద కుమార్తె థాయ్‌ యువరాణి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె బ్యాంకాక్‌కి ఉత్తరాన ఉన్న నఖోన్‌ రాట్చాసిమాలో జరుగుతున్న మిలటరీ శునకాల శిక్షణ కార్యక్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా బ్యాంకాక్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఇంటిన్సివ్‌ కేర్‌లో చికిత్స పొందుతున్నారు . ఆమె గుండె, ఊరితిత్తులు, కిడ్ని సరిగా పనిచేయడం లేదని థాయ​ ప్యాలెస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

ప్రస్తుతం ఆయా భాగాలకి వైద్యపరికరాల అమర్చి చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవానికి థాయ్‌లాండ్‌ రాజ్యం వారసత్వ నియమాలు పురుషులకే అనుకూలంగా ఉంటాయి. పైగా రాజు తర్వాత వారసుడిగా పురుషులనే ప్రకటిస్తారు. కాగా, అస్వస్థతకు గురయ్యినా 44 ఏళ్ల ప్రిన్స్‌ బజ్రకితియాభా మహిడోల్‌ని థాయ్‌లాండ్‌లోని ప్రజలు ప్రిన్సెస్‌ భా అని పిలుస్తారు. ఆమె థాయ్‌ రాజు మొదటి భార్య ఏకైక సంతానం. ఆమె థాయ్‌ రాజ్యంలో చాలా కీలక పాత్ర పోషించి అందరీ మన్ననలను అందుకుంది.

ఆమె ఒక చిన్న అభియోగానికి 15 ఏళ్లు వరకు జైలు శిక్ష విధించే పరువు నష్టం వంటి చట్టాలను విమర్శిస్తూ..ప్రజలను రక్షిస్తుందనే మంచి పేరు ఆమెకు ఉంది. ప్రజలంతా రాజకుటుంబంలోని సదరు యువరాణికే  పెద్ద పీఠ వేస్తారు. ప్రస్తుతం రాజ్యంలోని ప్రజలంతా ఆమె త్వరగా కోలుకోవాని ప్రార్థనలు చేయడమేగాక ఆమె త్వరగా కోలుకోవాలంటూ పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ ప్రచురిస్తున్నారు. 

(చదవండి: 5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్‌ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు)

మరిన్ని వార్తలు