More

లాటరీపై 28 శాతం పన్ను

19 Dec, 2019 02:43 IST

న్యూఢిల్లీ: లాటరీలపై 28 శాతం పన్ను విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన 38వ కౌన్సిల్‌ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. లాటరీ పన్ను పెంపు 2020 మార్చి నుంచి అమల్లోకి వస్తుందని రెవిన్యూ సెక్రటరీ పాండే తెలిపారు. అల్లిన బ్యాగులపై పన్నును 12 నుంచి 18 శాతానికి పెంచినట్లు పేర్కొన్నారు. మరిన్ని ఇండస్ట్రియల్‌ పార్క్‌లు వచ్చేందుకు ఇండస్ట్రియల్‌ ప్లాట్స్‌ మీద పన్ను మినహాయించామని చెప్పారు. గతంలో జరిగిన 37 కౌన్సిల్‌ సమావేశాల్లో జీఎస్‌స్టీ రేట్లపై అందరూ కలసి ఒకే నిర్ణయం తీసుకోగా, ఈ భేటీలో మొదటిసారి ఓటింగ్‌ ప్రక్రియను అమలు చేశారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా.. నూతన తెలంగాణ భవన్‌

మంటలు రేపిన..మాక్‌ పార్లమెంట్‌!

ఎన్‌ఐఏ చేతికి కర్ణిసేన చీఫ్ హత్య కేసు

Ayodhya Ram Temple: అద్వానీ, జోషిలకు అందిన ఆహ్వానం

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే?