More

ఇంకు చుక్కలతో మనసు బొమ్మ- గూగుల్ డూడుల్

8 Nov, 2013 11:36 IST

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మనోవైజ్ఞానికశాస్త్ర నిపుణుడు, విశ్లేషకుడు హెర్మాన్ రోర్షచ్ 129 జయంతిని పురస్కరించుకుని ఇంటర్నెట్ సెర్జ్ ఇంజిన్ గూగుల్ ఆయనకు ఘన నివాళి అర్పించింది. రోర్షచ్ గౌరవార్థం ఆయన బొమ్మతో డూడుల్ పెట్టింది. నోట్ ప్యాడ్, కలం పట్టుకుని రోర్షచ్ కూర్చున్న ఫోటోతో నలుపు, తెలుపు రంగుల్లో డూడుల్ను గూగుల్ ఉంచింది. ఇంక్ బ్లాటిల్ పేపర్పై రకరకాల చిత్రాలు మారుతున్నట్టుగా ఉన్న బొమ్మను మధ్యలో పెట్టింది. ఇందులో మనకు నచ్చిన చిత్రాన్ని గూగుల్ ప్లస్, ఫేస్బుక్, ట్విటర్లో షేర్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చారు.

క్లెక్సోగ్రఫీ(ఇంక్ చుక్కలతో బొమ్మలు వేసే పద్ధతి)ని మనోవైజ్ఞానిక శాస్త్రం ద్వారా విశ్లేషించడాన్ని హెర్మాన్ రోర్షచ్ ప్రవేశపెట్టారు. ఇంక్బ్లాట్ పేపర్పై వేసిన చిత్రాల ఆధారంగా మనుషుల మాసినక స్థితిని విశ్లేషించడం దీని ప్రత్యేకత. ఈ విధానం ద్వారా ముందుగా ఆయన పాఠశాల విద్యార్థుల స్పందనలను విశ్లేషించారు. తర్వాత కాలంలో కొన్నేళ్ల పాటు దీనిపై ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. మనోవైజ్ఞానిక శాస్త్రంలో ఇంక్బ్లాట్ పరీక్షలు ఏవిధంగా ఉపయోపడతాయో తెలుపుతూ 'సైకోడయాగ్నస్టిక్' పేరుతో ఆయన పుస్తకం రాశారు.

హెర్మాన్ రోర్షచ్... 1884లో నవంబర్ 8న స్విట్జర్లాండ్లోని జ్యురిచ్ల్ జన్మించారు. చిన్నతనంలో ఆయనకు క్లెక్సోగ్రఫీ మీద ఉన్న అభిరుచి కారణంగా ఆయనను 'క్లెక్స్' అని పిలిచేవారు.  గ్రాడ్యయేషన్ పూర్తయిన తర్వాత ఆయన ప్రముఖ మానసికశాస్త్ర నిపుణుడు యూజెన్ బ్లూలర్ శిష్యరికంలో మనోవైజ్ఞానిక శాస్త్రం అభ్యసించారు. మనోవైజ్ఞానిక శాస్త్రానికి ఆద్యుడయిన  సిగ్మండ్ ఫాయిడ్ కు సమానంగా పేరు గడించిన కార్ల్ యూంగ్ కూడా యూజెన్ బ్లూలర్ శిష్యులే కావడం విశేషం.  మనోవైజ్ఞానిక శాస్త్రం తనదైన ముద్ర వేసిన హెర్మాన్ రోర్షచ్ 37 ఏళ్ల ప్రాయంలోనే 1922, ఏప్రిల్ 1న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

క్రేజీ న్యూస్‌: 'పుష్ప 2'కు ముహుర్తం ఫిక్స్‌.. ఆ రోజే షూటింగ్‌ ప్రారంభం!

మోదీ చేసే మంచి పనులకు రాముడిలా కొలుస్తారు..

మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?

విశాఖను వరించిన 'సాగరమాల'

ఆ రెండూ లేకపోతే భారీ ప్రాణ నష్టమే సంభవించేది..