రైల్వే బ్రిడ్జిలకు గ్రీన్‌సిగ్నల్‌

22 Jan, 2018 07:00 IST|Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మాణం

రూ.76 కోట్లు మంజూరు, డిజైన్, అంచనా వ్యయం రూపొందించే పనిలో..

స్పిన్నింగ్‌ మిల్‌ సమీపంలో ఆర్‌ఓబీ ∙తాంసి బస్టాండ్‌ వద్ద ఆర్‌యూబీ

రాష్ట్ర ప్రభుత్వం వాటానే అధికం, ట్రాక్‌ భాగంలోనే కేంద్రం నిధులు వెచ్చింపు

సాక్షి, ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ వాసుల ఎన్నో ఏళ్ల డిమాండ్‌కు ఒక కదలిక వచ్చింది. జిల్లా కేంద్రంలో రైల్వే బ్రిడ్జిలు లేకపోవడంతో ప్రధాన మార్గాల్లో ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ నరకయాతనకు రానున్న రోజుల్లో ముగింపు పడనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైల్వేబ్రిడ్జిలను నిర్మించనున్నాయి. రెండు ప్రధాన మార్గాల్లో ఒకటి రైల్వే ఓవర్‌బ్రిడ్జి(ఆర్‌ఓబీ), మరొకటి రైల్వే అండర్‌బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు సంబంధించి డిజైన్‌తోపాటు అంచనా వ్యయాన్ని రూపొందిస్తున్నారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి పనులు చేపట్టే అవకాశం ఉంది.  

తాంసి బస్టాండ్‌ వద్ద రైల్వే అండర్‌బ్రిడ్జే..
ఆర్‌ఓబీ, ఆర్‌యూబీల నిర్మాణం కోసం ప్రభుత్వాలు రూ.76 కోట్లు మంజూరు చేశాయి. ఇందులో ప్రధానంగా రాష్ట్ర వాటానే అధికంగా ఉండనుంది. ట్రాక్‌ నిర్మా ణం ఉన్న చోటనే కేంద్రం నిధులు వెచ్చిస్తుందని అధికా రులు చెబుతున్నారు. మిగతా బ్రిడ్జి వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీంతోనే రాష్ట్రంపైనే అధిక భా రం పడనుంది. ప్రధానంగా మార్కెట్‌ యార్డుకు వెళ్లే దారిలోని తాంసి బస్టాండ్‌ సమీపంలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి(ఆర్‌ఓబీ) నిర్మించాలన్నది ఆదిలాబాద్‌ ప్రజల చిరకాల స్వప్నం. ఇక్కడ ఆర్‌ఓబీ నిర్మాణానికి సాధ్యత(ఫీజిబిలిటీ) కాదని చెప్పడం నిరాశ కలిగిస్తోంది. ఈ జంక్షన్‌ క్రాసింగ్‌ దగ్గర నుంచి 8 మీటర్ల తర్వాత వాహనాలు బ్రిడ్జి పైకి రావడానికి ఏటవాలుగా నిర్మించేందుకు అనువుగా లేదని చెబుతున్నారు. అదే సమయంలో ఆర్‌ఓబీ నిర్మించిన పక్షంలో అటు హైదరాబాద్, ఇటు నాగ్‌పూర్‌ కు ఎటువైపు అయిన మలిపేందుకు అనువుగా 90 డిగ్రీ ల టర్నింగ్‌ పాయింట్‌ నిర్మించేందుకు అనువుగా లేదని పేర్కొంటున్నారు.

జంక్షన్‌ నుంచి పంజాబ్‌చౌక్‌ వరకు వెళ్లే దగ్గర ఈ సాధ్యత లేదని అధికారులు చెబుతున్నా రు. ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇక్కడ ఆర్‌ఓబీ నిర్మా ణం సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. కాగా ఇటీవల కాలంలోనే పంజాబ్‌చౌక్‌ వద్ద రూ.1కోటి 20లక్షలతో చెరోవైపు 12 మీటర్ల వెడల్పుతో ఇరుపక్కల కొత్తగా రహదారిపై బ్రిడ్జిను పునర్‌నిర్మాణం చేపట్టారు. ఒకవేళ ఇక్కడ ఆర్‌ఓబీ నిర్మించిన పక్షంలో ఈ బ్రిడ్జి నిర్మాణం వృథా అయ్యే అవకాశం ఉంది. దీని కారణంగా అధికా రులు ఆర్‌ఓబీ నిర్మాణానికి వెనక్కి వస్తున్నారని తెలు స్తోంది. అదే సమయంలో ఇక్కడ వ్యాపార సముదా యం అధికంగా ఉండడంతో ఆర్‌ఓబీ నిర్మిస్తే ఈ సముదాయానికి ఇబ్బంది ఎదురవుతుందన్న కోణంలో ఆర్‌యూబీకి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

స్పిన్నింగ్‌ మిల్లు వద్ద రైల్వే ఓవర్‌బ్రిడ్జి..
స్పిన్నింగ్‌ మిల్లు వద్ద రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మించనున్నారు. ప్రధానంగా రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి అధిక వ్యయం అవుతుంది. అదే సమయంలో ఇక్కడ నిర్మాణానికి సాధ్యత ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ట్రాక్‌ నుంచి మార్కెట్‌ యార్డు వైపు 240 మీటర్లు, కలెక్టరేట్‌చౌక్‌ వైపు 150 మీటర్ల పొడవున ఓవర్‌ బ్రిడ్జి ఉంటుంది. కలెక్టరేట్‌ చౌక్‌ వద్ద ఏటవాలుగా వాహనాలు దిగిన తర్వాత ఇటు హైదరాబాద్, అటు నాగ్‌పూర్‌కు సులువుగా మలిగేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తద్వారా ఇక్కడే ఆర్‌ఓబీ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు