వేతనాల్లేవు... వాహనాలు తిరగవు...

20 Feb, 2018 14:20 IST|Sakshi
జేసీ–2 నాగేశ్వరరావుకు వినతిపత్రం అందిస్తున్న 108 ఉద్యోగులు

గ్రీవెన్స్‌సెల్‌లో 108 సిబ్బంది వినతి

అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన

కలెక్టరేట్‌లో నిర్వహించిన     ప్రజావాణికి 210 వినతులు

విజయనగరం గంటస్తంభం:  ఆపద సమయంలో ఆదుకునే 108 వాహనానికి గడ్డుపరిస్థితి దాపురించింది. అందులో పనిచేసే సిబ్బందికి నెలల తరబడి వేతనాలు అందడంలేదనీ... వాహనాలు సరిగ్గా తిప్పలేక సేవలు అందించలేకపోతున్నామని  సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో 108 సర్వీసెస్‌ ఎంప్లాయిస్‌ యూ నియన్‌ అధ్యక్షుడు బంగార్రాజు ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి సంయుక్త కలెక్టర్‌–2 కె.నాగేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 27 వాహనాలుండగా ఏడు సాంకేతిక కారణాల వల్ల పని చేయ డం లేదని, 15 వాహనాలకు ఇన్సూరెన్స్‌ లేక తిప్పలేకపోతున్నామని తెలిపారు. ఇక ఉద్యోగులకు జనవరి నెల నుంచి నెలవారీ జీతాలివ్వకుండా... పని చేసిన రోజులకే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవీకే సంస్థ ఏటా 10శాతం వేతనం పెంచేదని, 2016 నుం చి పెరగలేదన్నారు. 52రోజుల జీతం పెండింగ్‌లో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. వీటిని పరిష్కరించాలని కోరారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు మొత్తం 210 అర్జీ లు వచ్చాయి. జేసీ–2 నాగేశ్వరరావుతోపాటు డీఆర్వో ఆర్‌.ఎస్‌.రాజ్‌కుమార్‌ వినతులు స్వీకరించారు.

అందులో కొన్నింటిని పరిశీలిస్తే....
మూతపడిన జ్యూట్‌ మిల్లులు తెరిపించా లని ఇఫ్టూ జల్లా కమిటీ నాయకులు కె.సన్యాసిరావు, బోని సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు వినతిపత్రం ఇచ్చారు.
కుమిలిలో నిర్మించిన సామాలమ్మ గుడిని దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకో వాలని ఆ గ్రామానికి చెందిన జి.నాగిరెడ్డి కో రా రు.
దరం కార్యక్రమం జరగక ఇబ్బందులు పడుతున్నామని, తన కుమారుడు అజయ్‌ కోసం తొమ్మిది నెలలుగా తిరుగుతున్నా పట్టిం చుకోవడం లేదని బొబ్బిలికి చెందిన పి.జయరా వు తెలిపారు.
ప్రధానమంత్రి పసల్‌బీమా యోజనలో పని చేస్తున్న వ్యవసాయ బీమా కార్యకర్తలకు ఖరీఫ్‌ కాలంలోనే పని కల్పిస్తున్నారని, ఈ ఏడాది పని కల్పించాలని బీమా కార్యకర్తల ఆసోసియేషన్‌ అధ్యక్షుడు బి.ప్రశాంత్‌ తది తరులు వినతిపత్రం సమర్పించారు.
పూసపాటిరేగ మండలం పతివాడ పంచాయతీ త మ్మయ్యపాలెంలో సర్వే నెం: 111/2లో 10 ఎకరాలు 62సెంట్లు, 112లో 17.97ఎకరాలు ప్రభు త్వ భూమిలో మత్స్యకారులు చేపలు ఎండబెట్టుకుంటున్నారని, ఆ భూములు అక్రమణకు గురవుతున్నాయని సర్పంచ్‌ ఎ.పైడిరాజు, ఎంపీటీసీ సభ్యుడు కూర్మినాయుడు తదితరులు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అంతకుముందు నిర్వహించిన డయల్‌యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి ఎనిమిది ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు