అమ్మఒడితో తల్లి బ్యాంకు ఖాతాకు రూ.15 వేలు

9 Feb, 2019 08:02 IST|Sakshi
చిన్నారిని ముద్దాడుతున్న అమలాపురం పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌ చింతా అనురాధ, ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌

అమలాపురం పార్లమెంటరీ పార్టీ కో ఆర్డినేటర్‌ చింతా అనురాధ

తూర్పుగోదావరి, కాట్రేనికోన: మన ప్రభుత్వం అధికారం చేపట్టిన తక్షణమే జగనన్న నవరత్నాలలో ఒకటి ‘అమ్మ ఒడి’ పథకం కింద పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లుల బ్యాంకు ఖాతాకు ఏడాదికి రూ.15 వేలు జమ చేస్తామని అమలాపురం పార్లమెంటరీ పార్టీ కోఆర్డినేటర్‌ చింతా అనురాధ, ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్సార్‌ సీపీ కోఆర్డినేటర్‌ పొన్నా డ వెంకట సతీష్‌కుమార్‌ భరోసా ఇచ్చారు. కాట్రేనికోనలో శుక్రవారం మండల పార్టీ కన్వీనర్‌ నల్లా నరసింహమూర్తి, ఎస్‌ఆర్కే తాతాజీ, గంటి వెంకట సుధాకర్‌ల ఆధ్వర్యంలో ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ కార్యక్రమం జరిగింది.

చింతా అనురాధ, పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌లు కాట్రేనికోన రామస్వామి తోట, చెంచుల గరువు, బూలవారి పేట, జిల్లేళవారి పేటలలో ఇంటింటికీ వెళ్లి నవరత్నాల కరపత్రాలను అందించి ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్ధించారు. అంబేడ్కర్‌ విగ్రహాలకు పూల మాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికలలో రుణమాïఫీ చేస్తానని డ్వాక్రా మహిళలను మోసగించిన చంద్రబాబు ‘పసుపు కుంకుమ’ పేరుతో వంచన చేస్తున్నాడన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను ‘పసుపు కుంకుమ’ ప«థకానికి బదిలీ చేయడం సరికాదన్నారు. మీ చిన్నారులను బడికి పంపిస్తే అమ్మ ఒడి పథకంతో ప్రతి నెలా రూ.1500లు చొప్పున లబ్ధిచేకూరుతుందన్నారు. నిరుపేద విద్యార్ధులకు భోజన వసతికి ఏడాదికి రూ. 20 వేలు చెల్లిస్తామన్నారు. పెయ్యల చిట్టిబాబు, మోకా చంద్ర నాగరత్నం, నడింపల్లి సూరిబాబు, కుడిపూడి శివన్నారాయణ, సంసాని నాగేశ్వరరావు, కాశి హనుమంతరా వు, కొప్పిశెట్టి వామనమూర్తి, గుత్తుల పద్మ, రేవు మల్లేశ్వరి, పోతుల రత్నకుమారి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు