చిన్నారులను చిదిమేస్తున్నారు

11 Sep, 2013 04:15 IST|Sakshi


 పాలబుగ్గల చిన్నారులు, బుడిబుడి నడకల పాపాయిలు సైతం పురుషుల కామవాంఛకు బలైపోతున్నారు. ఆడుకోడానికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారిని ఒక మృగాడు మాయమాటలతో చెరుకు తోటలోకి తీసుకెళ్లాడు. లైంగికదాడికి పాల్పడ్డాడు. తర్వాత తాడుతో మెడకు బిగించి చంపాడు. ఇంతకూ ఈ చిన్నారి చేసిన పాపం ఏమిటి?       
 శ్రీకాళహస్తి/ఏర్పేడు, న్యూస్‌లైన్:
 అన్నెం పుణ్నెం ఎరుగని ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకు గురికావడం ఏర్పేడు మండలంలోని కుక్కలగుంట ఎస్టీ కాలనీలో విషాదం నిం పింది. ఎస్టీ కాలనీకి చెందిన సుజాత(6) స్థానిక పా ఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఆడుకునేందుకు పాఠశాల వద్దకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన గిలకల చిన్నసుబ్బయ్యు కువూరుడు గిరి(25) బాలికకు మాయమాటలు చెప్పి చెరుకు తోటలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బాలిక స్పృహ కోల్పోయింది. దీంతో బాలిక మెడను తాడుతో బిగిం చాడు. బాలిక చనిపోయిందని నిర్ధారించుకుని ఇంటికి వచ్చేశాడు. కాగా ఆదివారం సాయంత్రమే బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు రేఖ, మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.మంగళవారం సుజాత మృతదే హాన్ని చెరకు తోటలో గుర్తించారు. బాలిక శరీరంపై పళ్ల గాట్లు, తాడుతో బిగించిన గుర్తులు ఉన్నాయి.
 
 
 తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబు, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రామ్‌కువూర్, ఎస్‌ఐ విక్రమ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయుంతో నిందితుడి ఆచూకీ కోసం ప్రయుత్నించారు. విషయం బయటకు పొక్కడంతో అత్యాచారం, హత్యకు పాల్పడిన గిరి పారిపోతుండగా రేణిగుంట వుండలంలోని అ త్తూరు సమీపంలో స్థానికులు జనార్దన్, సురేంద్ర పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కుక్కలగుంట ఎస్టీకాలనీలో విషాదం నెలకొంది.
 
 కఠినంగా శిక్షించాలి
 బాలికపై అత్యాచారం హత్యకు పాల్పడిన గిరిని కఠినంగా శిక్షించాలని ఎస్టీ కాలనీ వాసులు కోరుతున్నారు. ఇతను గతంలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని వారు తెలిపారు. గిరి మొదటి భార్య భర్త వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. అతను రెండో పెళ్లి చేసుకోగా, ఆమె కూడా ఇతని వేధింపులు తట్టుకోలేక ఇంట్లోనించి పారిపోయిందన్నారు. నేర చరిత్ర ఉన్న గిరిని  కఠినంగా శిక్షించాలని గ్రావుస్తులు కోరారు.
 
 ఆరునెలల్లో నాలుగో ఘటన
 శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో ఆరునెలల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది నాల్గవసారి. ఐదు నెలల క్రితం శ్రీకాళహస్తి వుండలం భీవువరంలో ఎనిమిదేళ్ల బాలిక పంటపొలాల్లో లైంగికదాడికి గురైన విషయుం తెలిసిందే. ఆ బాలిక అనారోగ్యంతో ఇప్పటికీ అవస్థలు పడుతోంది. శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై తరగతిగదిలోనే కిందిస్థారుు ఉద్యోగి అత్యాచారానికి ఒడిగట్టాడు. మూడు నెలల క్రితం వుండలంలోని ఎగువవీధి గ్రావుంలో ఆడుకుంటూ దాహంతో మంచినీళ్లు తాగేందుకు స్నేహితురాలి ఇంట్లోకి వెళ్లిన చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన అప్పట్లో సంచలనలం రేపింది. ప్రస్తుతం ఏర్పేడు మండలంలో ఆరేళ్ల సుజాత అత్యాచారం, హత్యకు గురికావడం ఈ ప్రాంతవాసులను మరింత ఆందోళనకు గురిచేసింది. ఇలాంటి నేరాలపై పోలీసులు అధి కారులు కఠిన చర్యలు తీసుకోవాలని  కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు