పథకం ప్రకారమే హత్య

23 Sep, 2014 02:43 IST|Sakshi
పథకం ప్రకారమే హత్య

అంజలి కేసులో నిందితుడు అరెస్ట్‌రాజుపాళెం: మండల కేంద్రమైన రాజుపాళెం ఎస్సీకాలనీకి చెందిన సరవళ్ల శివరామకృష్ణ పథకం ప్రకారమే భార్య అంజిలిని హత్య చేసినట్లు డీఎస్పీ జరుగు శ్రీనివాసులరెడి తెలిపారు. ప్రొద్దుటూరులోని రూరల్ సీఐ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఎస్సీ కాలనీకి చెందిన అంజలి గత 6వ తేదీన వాస్మోల్ తాగి మృతి చెందిందని రాజుపాళెం పోటీస్‌స్టేషన్‌లో అంజిలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మృతురాలి భర్త శివరామకృష్ణను విచారించారు. అంజలి వేరే వారితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త తరచూ తిడుతూ, కొడుతూ ఉండేవాడు. గత 6వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతని భార్య ఇంట్లో పని చేస్తుండగా ఆమెతో గలాటా పెట్టుకొని గొంతు నులిమి చంపాడు. ఆమె చనిపోయిన తర్వాత ప్రజలను నమ్మించేందుకు ఇంట్లో ఉన్న సూపర్‌వాస్మోల్‌ను అంజలి పెదవులకు పూసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. తన భార్య పలకలేదు, చికిత్స కోసమని ఆటోలో రోడ్డు వరకు తీసుకొచ్చి చనిపోయిందని తిరిగి ఇంటి వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ నుంచి శివరామకృష్ణ పరారయ్యాడు. అంజలి చనిపోయిన విషయం ఆరోజు సాయంత్రం వరకు ఎవరూ చెప్పడం లేదు. అదే కాలనీకి చెందిన పెద్దన్న అనే వ్యక్తి మృతురాలు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. చనిపోయిన కూతురును చూసి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు శివరామకృష్ణను విచారించగా ఈ విషయాలు వెల్లడైనట్లు డీఎస్పీ వివరించారు. ఆర్‌ఐ ద్వారా ఒప్పుకోలు నామాను నమోదు పరిచి అరెస్ట్ చేశామన్నారు. ముద్దాయిని కోర్టుకు పరుస్తున్నట్లు తెలిపారు. రూరల్ సీఐ దారెడ్డి భాస్కరరెడ్డి, రాజుపాళెం ఎస్‌ఐ కె.సుబ్బారావు, పోలీసులు గురివిరెడ్డి, భూపాల్‌రెడ్డిలు పాల్గొన్నారు.



 

>
మరిన్ని వార్తలు