బిడ్డను ఎప్పుడెప్పుడూ చూస్తానా అనుకుంది! కానీ అదే ఆమెకు..

1 Dec, 2023 13:42 IST|Sakshi

ప్రేమించిని వ్యక్తి మోసం చేస్తాడన్న ఆలోచన రాదు కాబట్టే భాగస్వామి చేతిలో సులభంగా ఓడిపోతారేమో!. అతడేంటి అనేది పరిస్థితులు ఎదురైతే గానీ అసలు నిజస్వరూపం బయటపడదు. వాస్తవం తెలిసే లోపు కథ ముగిసిపోతుంది. అలానే వెనెస్సె పియరీ అనే ఓ అమాయకురాలి ప్రాణంగా ప్రేమించాననుకుంది. ఇద్దరం కాస్తం ముగ్గురంగా మారి కుటుంబంగా ఏర్పడుతున్నాం అన్న ఆనందంలో ఉక్కిరిబిక్కిరయ్యింది. అదే తనకు మృత్యువుగా మారుతుందని ఊహించలేదు. ప్రేమించింది కిరాతకుడని అని తెలిసేలోపే.. భూమ్మీదే లేకుండా పోయింది. ఈ నిజం మూడేళ్ల తర్వాతగానీ వెలుగులోకి రాలేదు. 

అసలేం జరిగిందంటే..యూఎస్‌కి చెందిన 33 ఏళ్ల గోయ్‌ చార్లెస్‌ అనే వ్యక్తి వెనెస్సా పియరీ ఇద్దరూ ప్రాణాంగా ప్రేమించుకున్నారు. పియరీకి అతడి ప్రేమలో సంతోషంగా రోజులు తెలియకుండా గడిచిపోతున్నాయి. వారివురి ప్రేమకు గుర్తుగా పియరీ తల్లి కాబోతోంది. ఈ ఆనందకర విషయం పియరీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాము ఇరువురం కాస్తా ముగ్గురమవుతున్నాం అన్న ఆనందంలో తేలియాడుతుంది. తమకంటూ కుంటుంబం ఏర్పడాలన్న కల నిజమవుతున్నా ఆనందంలోనే ఉంది. కానీ ప్రియుడు గోయ్‌ చార్లెస్‌ మనసులో ఏముందో గ్రహించలేకపోయింది. అతడు కూడా హ్యాపీగా ఉన్నాడనే అనుకుంది. ఓ పక్క పియరీకి నెలలు నిండుతున్నాయి. ఒక రోజు ఎప్పటిలానే తన ప్రియుడితో కలిసి కారులో బయటకి వెళ్తోంది.

ఇదంత ఇష్టంలేని గోయ్‌ చార్లెస్‌ మంచి వాడిలా నటిస్తున్న​ ముసుగు తీసి తన క్రూరత్వాన్ని చూపించబోతున్నాడని తెలియని పియరీ నవ్వుతూనే అతడితో మాట్లాడుతోంది. సడెన్‌గా హైవే మీద ఆపినా కూడా ఎందుకుని అడగలేదు, అనుమానించ లేదు పియరీ. పక్కాప్లాన్‌తో ఉన్న చార్లెస్‌ ఆమె ఆరు నెలల నిండు గర్భిణి అన్న కనికరం లేకుండా ఆమెను గొంతు నులిమి చంపేసి హైవేమీద పడేసి కామ్‌గా వెళ్లిపోయాడు. ఎవ్వరూ చూడలేదు కదా అనే అనుకున్నాడు. ఈ దారుణ ఘటన అక్టోబర్‌ 23, 2020న జరిగింది. ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ మహిళ పడి ఉందని బస్‌ డ్రైవర్‌ సమాచరం ఇవ్వడంతో.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె ఎవరని ఎక్వైయిరీ చేయగడం ప్రారంభించారు.

విచారణలో బాధితురాలు 29 ఏళ్ల వెనెస్సా పియరీగా గుర్తించారు పోలీసులు. ఎందువల్ల చనిపోయిందన్న దిశగా బాధితురాలు బంధువులను విచారించగా..ఆమె సోదరి మెలిస్సా ప్రియరీ అసలు విషయం పోలీసులు చెబుతుంది. దీంతో పోలీసులు గోయ్‌ చార్లెస్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కానీ అతడు నేరాన్ని అంగీకరించలేదు. దీంతో సాక్షాధారాల కోసం ముమ్మరంగా ఇన్విస్టేగేషన్‌ చేస్తున్న పోలీసులకు ఆ రోజు పియరీ, చార్లెస్‌ దంపతుల ప్రయాణించిన కారు ఆధారంగా సాక్షాధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఎందుకంటే ఆ కారు పియరీ పేరు మీదే రిజస్ట్రై అయ్యి ఉంది. 

అలాగే ఆ ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీఫుటేజ్‌ కూడా ఈ కేసులో కీలకమైంది. అందులో చార్లెస్‌ పియరీని ఈడ్చుకెళ్లి హైవే పై కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తున్నట్లు రికార్డు అయ్యింది. ఇక పోస్ట్‌మార్టంలో సైతం ఆమెను గొంతు నులిమి చంపినట్లు వెల్లడైంది కూడా. దీంతో పోలీసులు వీటన్నింటిని కోర్టుకి సమర్పించడంతో గత బుధవారమే నిందితుడు చార్లెస్‌కి 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ హత్య జరిగిన మూడేళ్లకి ఆ కిరాతకుడికి శిక్షపడటం బాధగా ఉన్నా..ఎట్టకేలకు పియరీకి న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందని ఆమె సోదరి మెలిస్సా ఆనందంగా చెప్పింది.

(చదవండి: సీక్రెట్‌ వైట్‌హౌస్‌! ప్రపంచంలోనే అందమైన భవంతి!)

మరిన్ని వార్తలు