ఆళ్ల నాని ఔదార్యం

14 Jun, 2019 18:09 IST|Sakshi

సాక్షి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం​ అందించి నిజమైన ప్రజాసేవకుడిగా నిలిచారు. విజయవాడ జాతీయ రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు గాయాలపాలయ్యారు. అదే రహదారిలో వెళుతున్న వైద్యశాఖ మంత్రి ఈ ఘటనను చూసి వెంటనే స్పందించి తన కాన్వాయ్‌లో క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి పంపించారు. ఏలూరు నుండి అమరావతిలోని అసెంబ్లీకి వెళుతున్న ఆళ్ల నాని విజయవాడ దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


క్షతగాత్రులు బాధపడుతున్న దృశ్యాన్ని చూసిన ఆయన వెంటనే కారును ఆపి బాధితులను ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిలో ఇద్దరికి ప్రాథమికి చికిత్స అనంతరం డాక్టర్లు పంపించివేశారు. మరొక క్షతగాత్రుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి మంత్రి ఆళ్ళ నాని 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. గాయపడిన వ్యక్తి గుంటూరు సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఔదార్యం చూపిన ఉప ముఖ్యమంత్రిపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి.

మరిన్ని వార్తలు