సోక్రటీస్‌తో సమానుడు అంబేద్కర్

8 Sep, 2014 02:12 IST|Sakshi
సోక్రటీస్‌తో సమానుడు అంబేద్కర్

  కనిగిరి : సోక్రటీస్, అరిస్టాటిల్ తో సమానుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. అని దళిత ఉద్యమ నిర్మాత డాక్టర్ కత్తి పద్మారావు అన్నారు. రాజధానిలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పుస్తకంతో దేశాన్ని జయంచిన అపర మేధావి అంబేద్కర్ అని పద్మారావు కొనియాడారు.

రాజధాని కేంద్రంలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో దళిత, బహుజనులు, ప్రజాస్వామికవాదులు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. దళిత నాయకులు ఆత్మకూరి చెన్నయ్య, కటికల రత్నం, జి.రవికుమార్ మాదిగ, ప్రొఫెసర్ కేవీఎన్ రాజు మాట్లాడారు.

తొలుత అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. అంబేద్కర్ వ్యక్తిత్వ దర్శనం, బహుజన దర్శనం పుస్తకాలను పద్మారావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో దళిత, బహుజన నాయకులు రామ్మోహన్, పెరుగు శ్రీధర్, దద్దాల శ్రీనివాసులుయాదవ్, టీఐ ప్రతాప్, కేవీ రత్నం, చింతల పూడి వెంకటేశ్వర్లు, బాల గురవయ్య, దేపూరి వెంకటేశ్వర్లు, శివకాశయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు