'రాజధాని కోసం రాజధానుల అధ్యయనం'

9 Aug, 2014 13:51 IST|Sakshi
'రాజధాని కోసం రాజధానుల అధ్యయనం'

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రపంచంలోని ఆరు దేశాల రాజధానులతోపాటు దేశంలోని నాలుగు రాష్ట్రాల రాజధానులను అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు రాజధాని సలహా కమిటీ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం అందుకోసం ఏర్పాటు చేసిన సలహా కమిటీ భేటీ అయింది. అనంతరం ఆ భేటీ వివరాలను నారాయణ వివరించారు. బ్రెజిల్, ఇస్లామాబాద్, పుత్రజయ, ఆస్టిన్,దుబాయి, సింగపూర్లలో కమిటీ పర్యటిస్తుందని చెప్పారు.

అలాగే దేశంలోని చంఢీగడ్, గాంధీనగర్, నయా రాయ్పూర్, నవీ ముంబయి ప్రాంతంలో కూడా కమిటీ పర్యటిస్తుందని తెలిపారు. తమ కమిటీకి అదనంగా టెక్నికల్ కమిటీ, ఇతర సబ్కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు నారాయణ చెప్పారు. రాష్ట్రంలోని 9 జిల్లాలలో 11 జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు నారాయణ వెల్లడించారు.

మరిన్ని వార్తలు