అదిగదిగో ఏపీ ఎక్స్‌ప్రెస్‌

11 Aug, 2015 23:25 IST|Sakshi
అదిగదిగో ఏపీ ఎక్స్‌ప్రెస్‌

ఏపీ ఎక్స్‌ప్రెస్ నేడు ప్రారంభం
ఎట్టకేలకు కల సాకారం
నగరం నుంచే పట్టాలపైకి..
ఆగమేఘాల మీద ఏర్పాట్లు

 
ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు ముహూర్తం ఖరారైంది. బుధవారం నుంచి ఇది పట్టాలెక్కనుంది. విశాఖ వాసులు ఆశించినట్లుగానే ఇక్కడ నుంచే నడవనుంది. నేటి ఉదయం ఈ రైలును ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. 16 బోగీల ఈ ఏసీ సూపర్‌ఫాస్ట్  ఎక్స్‌ప్రెస్ మంగళవారం రాత్రి విశాఖ కోచింగ్ కాంప్లెక్స్ చేరుకుంది. గత బడ్జెట్‌లో విజయవాడ నుంచి బయలుదేరుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడి ఒత్తిళ్లకు రైల్వే బోర్డు తలొగ్గింది. విశాఖ నుంచే నడపాలని పచ్చజెండా ఊపింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ఈ రైలును ప్రారంభించినట్టు ప్రకటిస్తారు. 14 నుంచి అధికారికంగా టికెట్లుజారీ అవుతాయయి. ప్రారంభోత్సవం రోజు జనరల్ టికెట్లు తీసుకున్న ప్రయాణికులకు రైలులో  రిజర్వేషన్‌ఛార్జీ వసూలు చేస్తారు.         - విశాఖపట్నం సిటీ
 
ఆగే స్టేషన్లు: దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, రామగుండం, తిరుపూర్, కాగజ్‌నగర్, బల్లార్స, చంద్రపూర్, నాగపూర్, ఇటార్సి, బోపాల్, జాన్సీ, గ్వాలియర్, ఆగ్రా స్టేషన్లమీదుగా..

విశాఖపట్నం-ఢిల్లీ ఏసీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (22415)
విశాఖ నుంచి : బుధ,శుక్ర, ఆదివారాలు
సమయం:  ఉదయం7.45 గంటలు
ఢిల్లీ చేరిక: మర్నాడు రాత్రి 7 గంటలు
బోగీలు: ఫస్ట్ ఏసీ 1, సెకండ్ ఏసీ 5, థర్డ్‌ఏసీ 7,
కిలోమీటర్లు : 2099
 
తిరుగు ప్రయాణం ఢిల్లీ-విశాఖపట్నం ఏసీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (22416):
ఢిల్లీ నుంచి: సోమ, బుధ, శుక్రవారాల్లో
సమయం: ఉదయం 6.40 గంటలకు
విశాఖ చేరిక: మర్నాడు సాయంత్రం 6.45 గంటలకు
 

 

మరిన్ని వార్తలు