‘జనసేనతో కూటమిగా వెళ్తాం’

10 Nov, 2018 19:13 IST|Sakshi

సాక్షి, తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన పనికి మాలినపాలన అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  ఆరోపించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోయారని.. త్వరలో వామపక్షాలు, జనసేన, లోక్‌సత్తాతో కలిసి ఫ్రంట్‌గా ఏర్పడి ప్రజల్లోకి వెళతామని ఆయన ప్రకటించారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఢిల్లీలో పార్లమెంట్‌ ముందు ఆందోళనలు చేపడతామని ఆయన అన్నారు.

రెండు నెలల క్రితం కరువు మండలాలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం  తరువాత  ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.  కర్నూలు, అనంతపురం జిల్లాలలో కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రభుత్వం  ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు