‘కూన రవికుమార్‌ క్షమాపణలు చెప్పాలి’

27 Aug, 2019 16:16 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఉద్యోగులను అవమానించిన వ్యాఖ్యలపై ఏపీ ఎన్‌జీఓ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన కూన రవికుమార్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటివి పునరావృతం అవుతున్నాయని మండిపడింది. కూనరవికుమార్‌పై కేసు నమోదు చేయాలని కోరింది. 

అతను బెదిరింపులకు పాల్పడ్డ ఆడియో వీడియో సాక్ష్యాలు కూడా తమ దగ్గర ఉన్నాయని ఏపీ ఎన్‌జీఓ పేర్కొంది. ఈ సందర్భంగా జిల్లా ఎంపీడీఓ సంఘం అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు అని.. అలాంటి ఉద్యోగులను అవమానపరచడాన్ని, వారిపై బెదిరింపులకు దిగటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రవికుమార్‌పై చర్యలు తీసుకోకపోతే ఉద్యోగులమంతా మూకుమ్మడి సెలవులకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.

చదవండి: చెట్టుకు కట్టి కాల్చేస్తా; టీడీపీ నేత బెదిరింపులు

మరిన్ని వార్తలు