పల్లెకు చేరిన ఈ-పాలన

23 Sep, 2014 01:58 IST|Sakshi
పల్లెకు చేరిన ఈ-పాలన

 సంతకవిటి : పంచాయతీ ల్లో ఈ పాలన మొదలైంది. దీంతో గ్రామీణ ప్రజలకు సైతం ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలి దశలో కొన్ని పంచాయతీలో ప్రారంభమైన ఈ ప్రక్రియ దశలవారీగా అన్ని పంచాయతీలకు విస్తరించనుంది. ఇప్పటివరకూ పంచాయతీల్లో రికార్డుల నిర్వహణతోపాటు అన్ని రకాల పనులు రాతకోతల రూపంలోనే జరుగుతున్నాయి. విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండే ది కాదు. కొందరు పెద్దలు తీసుకున్న నిర్ణయాలను అందిరపై రుద్దేవారు. ఈ పాలనలో భాగంగా అన్ని కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో పొందుపరచడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. ఏం జరుగుతుందన్నది ఎవరైనా తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. అక్రమాలను అరికట్టగలగడంతోపాటు వివిధ రకాల ధ్రువపత్రాలను సకాలంలో అందించేందుకు వీలవుతుంది. పంచాయతీ కార్యదర్శుల చుట్టూ రోజుల తరబడి కాళ్లరిగేలా తిరిగే బాధ తప్పుతుంది. అన్నింటికీ మించి ఎప్పుడూ మూసి ఉండే గ్రామసచివాలయాలు ఇక నుంచి  365 రోజులు ప్రజలకు సేవలందించనున్నాయి.
 
 జిల్లాలో ఇలా...
 జిల్లాలో మొత్తం 1099 పంచాయతీలు ఉండగా తొలిదశగా ప్రస్తుతం 87 పంచాయతీల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. సంతకవిటి మండలంలో మొత్తం 34 పంచాయతీలు ఉండగా ఆరు పంచాయతీల్లో వీటిని గత నెలాఖరు నుంచే ప్రా రంభించారు. మందరాడ, వాసుదేవపట్నం, సంతకవిటి, మామిడిపల్లి, బొద్దూరు, గుళ్లసీతారాంపురం పంచాయతీలు ఆన్‌లైన్‌లో చేరాయి. ఈ కార్యాలయాల్లో ఇప్పటికే కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. గ్రామ సచివాలయాలకు పక్కా భవనాలు ఉన్నచోటనే కంప్యూటర్లు ఏర్పా టు చేశారు. పక్కా భవనాలు లేని ప్రాం తాల్లో అద్దె భవనాల్లో వీటిని ప్రారంభిం చేందుకు చర్యలు చేపడుతున్నామని సంతకవిటి ఎంపీడీవో ఎ.త్రినాథస్వామి తెలి పారు.  
 
 నెట్‌లో సమాచార సమస్తం
 ఈ సేవలు ప్రారంభించిన పంచాయతీల కు సంబంధించిన సమస్త సమాచారం, వాటి పరిధిలో లభించే సేవల వివరాలన్నీ ంటర్‌నెట్‌లో సంబంధిత పంచాయతీ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయి. పంచాయతీలోని వార్డులు, ఓటర్లు, జానాభా వివరాలు, స్త్రీలు, పురుషులు, పిల్లల వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలు, జనన, మరణ వివరాలు, ధ్రువీకరణ పత్రా ల జారీ పరిస్థితి తదితర అంశాలన్నీ ఆన్‌లైన్‌లోనమోదవుతుంటాయి. అలాగే పంచాయతీల ఆస్తులు, పన్నుల వివరాలు, విని యోగ ఫలితాలు, ఆదాయ వ్యయాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తుంటారు. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు నిధుల మంజూరు, వినియోగ వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.  
 

మరిన్ని వార్తలు