-

గళమెత్తిన రైతన్న

11 Oct, 2013 03:56 IST|Sakshi
అన్నపూర్ణగా కీర్తి పొందిన రాష్ట్రాన్ని ముక్కలు చేయడంపై అన్నదాతలు మండిపడ్డారు. వైఎస్‌ఆర్ సీపీ దన్నుగా నిలబడడంతో రైతు దీక్ష చేసి విభజనకు తమ వ్యతిరేకతను తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా రైతు దీక్ష కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలతో పాటు రైతులు కూడా దీక్షల్లో పాల్గొని సమైక్య వాణిని వినిపించారు. రాష్ట్రం విడిపోతే అన్నపూర్ణ అన్న కీర్తి కూడా చరిత్ర అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
 బొబ్బిలి, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లాలో గురువారం రైతులు సమైక్య దీక్షలు చేపట్టారు. జిల్లాలోని 8 నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఈ దీక్షలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ రైతులు రోడ్లను దిగ్బంధం చేసి దీక్ష చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ ధోరణి, రాజకీయ లబ్ధికి రాష్ట్రాన్ని విడగొట్టే తీరు, పదవులు వదలక, ప్రజల పక్షాన నిలవని నాయకుల ప్రవర్తనను ఎండగట్టారు. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండల కేంద్రంలో రైతులు భారీ ఎత్తున దీక్ష చేపట్టారు. బొబ్బిలి, రామభద్రపు రం, తెర్లాం మండలాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, రైతులు హాజరై దీక్షలో పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు, అరుకు పార్లమెంటు పరిశీలకుడు ఆర్వీఎస్‌కేకే రంగారావు(బేబీనాయన)లు రైతు దీక్షలకు మద్దతు పలికారు. 
 
 కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై రాష్ట్ర విభజనకు నిర్ణ యం తీసుకోవడం వల్ల రైతులకు తీరని నష్టం కలుగుతుందన్నారు. అన్ని వర్గాల క్షేమం కోసం అక్టోబరు రెండు నుంచి నవంబరు ఒకటి వరకూ ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో పార్టీ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు సింగుబాబు ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ గొర్లె వెంకటరమణ, డాక్టరు పెనుమత్స సురేష్‌బాబు, కాకర్లపూడి శ్రీనివాసరాజు పాల్గొన్నారు.పార్వతీపురం మం డల కేంద్రంలో సమన్వయకర్తలు కొయ్యాన శ్రీవాణి, జమ్మాన ప్రసన్నకుమార్, ఉదయభానుల ఆధ్వర్యంలో ఎడ్ల బళ్ల ర్యాలీ, దీక్షలు జరి గాయి. కన్వీనర్లు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. 
 
 కురుపాం నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు ఆధ్వర్యంలో రైతులు దీక్షలు చేపట్టారు. జియ్యమ్మవలస మండల కేంద్రంలో శత్రుచర్లతో పాటు గ్రంథాలయ మాజీ చైర్మన్ దత్తి లక్ష్మణరావు దీక్షలో పాల్గొన్నారు. గరుగుబిల్లి మండల కేంద్రంలో ద్వారపురెడ్డి సత్యనారాయణ, కొమరాడ మండల కేంద్రంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గుల్లిపల్లి సుదర్శనరావు ఆధ్వర్యంలో రైతు దీక్షలు జరిగాయి. చీపురుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త శిమ్మినాయుడు ఆధ్వర్యం లో ఎడ్లబళ్ల ర్యాలీ, దీక్షలు చేపట్టారు. గుర్ల మం డలంలో కెల్ల సూర్యనారాయణ ఆధ్వర్యంలో రైతులు దీక్షలో పాల్గొన్నారు. గజపతినగరం నియోజవర్గంలోని అన్ని మండలాల్లోనూ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యం లో దీక్షలు జరిగాయి.
 
 బొండపల్లిలో చేపట్టిన దీక్షలో కూర్చున్న రైతులకు పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు సంఘీభావం తెలిపారు. గంట్యాడ మండలం కొఠారుబిల్లి జంక్షన్‌లో రైతులు రాస్తారోకో చేశారు. గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన దీక్షలో కడుబండితో పాటు డాక్టరు ఎస్ పెద్దినాయు డు, మక్కువ శ్రీధర్ పాల్గొన్నారు. ఎస్.కోటలో నియోజకవర్గ సమన్వయకర్తలు బోకెం శ్రీని వాస్, వేచలపు చినరామునాయుడు, డాక్టర్ గేదెల తిరుపతిరావు నేతృత్వంలో దీక్షలు చేపట్టారు. సాలూరు నియోజకవర్గంలో సమన్వయకర్తలు గరుడబిల్లి ప్రశాంత్, రాయలసుందరరావు ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. కార్యక్రమంలో పార్టీ నాయకులు గొర్లె మధుసూధనరావు, జర్జాపు సూరిబాబు పాల్గొన్నారు. 
 
 రాష్ట్రాన్ని చీల్చితే అథోగతే
 బలిజిపేట రూరల్: రాష్ట్ర విభజన జరిగితే తెలుగు ప్రజలకు అథోగతి తప్పదని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా పరిశీలకుడు జహీర్ అహ్మద్ అన్నారు. బలిజిపేటలో మండల వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రైతు దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్‌ఆర్ ఎంతో కృషి చేశారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారని అన్నారు. విభజన జరిగితే సాగునీరు, నిరుద్యోగ సమస్యలు పట్టి పీడిస్తాయని తెలిపారు. వీటిని గమనించే జగన్‌మోహన్ రెడ్డి దీక్ష చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎమ్.శ్రీరామూర్తి, బి.కాశినాయుడు, ఎస్.సత్యంనాయుడు, పి.సత్యన్నారాయణ రాజు, పి.నారాయణరావు, జి.చిరంజీవి మాష్టారు, పి.మురళీక్రిష్ణ,  కె.పాపినాయుడు, జి.స్వామినాయుడు, ఎమ్.వేణుగోపాలనాయుడు, ఎమ్.ప్రసాదరావు, విజయందొర తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు