సామాజిక న్యాయం..బీజేపీ లక్ష్యం

7 Jun, 2015 00:13 IST|Sakshi

 పలాస: అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి జీఆర్ రవీంద్రరాజు అన్నారు. కాశీబుగ్గ టీకేఆర్ కల్యాణ మండపంలో మహాసంపర్క అభియాన్ కార్యశాల వర్క్‌షాపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు అధ్యక్షతన శనివారం జరిగింది.  జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలు, మండలాల నుంచి పాల్గొన్న ముఖ్య కార్తకర్తలు, ప్రముఖలనుద్దేశించి రవీంద్రరాజు
 మాట్లాడారు.
 
 కార్యకర్తలు అంకిత భావంతో పనిచేసి గ్రామాల్లో, పట్టణాల్లో పార్టీని బ లోపేతం చేయాలని పిలుపునిచ్చారు. దేశప్రయోజనం, తర్వాత పార్టీ ప్రయోజనం, చివరిగా తమ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జన సంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు చేసిన త్యాగాలు, కృషి గురించి వివరించారు.
 
 ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పి.వేణుగోపాలం, రాష్ట్ర కిసాన్ మోర్చ అధ్యక్షుడు పూడి తిరుపతిరావు, జిల్లా ఇన్‌చార్జి పీవీఎన్ మాధవ్, జిల్లా సంపర్క ప్రముఖ్ డాక్టర్ కణితి విశ్వనాథం, జిల్లా సహ సంపర్క రౌతు చిరంజీవరావు, జిల్లా సభ్యత్వ సహ ప్రముఖ్ సంపతిరావు నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వెంకటరావు, రాష్ట్ర మహిళామోర్చ ప్రధాన కార్యదర్శి జి.భాగ్యలక్ష్మి, పార్లమెంటరీ ఇన్‌చార్జి అట్టాడ రవిబాబు, కన్వీనర్ ప్రధాన మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు