వరద ముంపులో బుచ్చెంపాలెం

31 Aug, 2014 02:55 IST|Sakshi

దేవరాపల్లి: మండలంలోని వాలాబు రిజర్వాయరు నుంచి పోటెత్తిన వరదనీరు శనివారం బుచ్చెంపాలెం గ్రామాన్ని ముంచెత్తింది. వర్షా లకు రిజర్వాయరులో నీటి మట్టం పెరిగిపోవడంతో గ్రామంలో జనం ఎటూ వెళ్లలేని పరిస్థితి చోటుచేసుకుంది. ఏ క్షణాన వరదనీరు తమ గ్రామాన్ని ముంచెత్తుతుందోనన్న భయంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాయం కోసం ఎదురు చూపుఇక్కడ 18 కుటుంబాలవారు నిత్యావసరాలు, వైద్య సాయం కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామంలో జ్వరాలతోపాటు కునెపు నర్సమ్మ(60) శుక్రవారం రాత్రి వంటచేస్తుండగా అగ్నిప్రమాదానికి గురైంది. వైద్యసిబ్బంది పట్టించుకున్న పాపాన పోలేదు.
 
అధికారులు చర్యలు శూన్యం
 
ముంపునకు గురవుతున్న ఈ గ్రామానికి వెళ్లేం దుకు దేవరాపల్లి ఎస్‌ఐ ఇ. లక్ష్మణరావు శుక్రవారం ప్రయత్నించారు. సెల్‌ఫోన్ సాయంతో వారి క్షేమసమాచారాన్ని తెసుకొని వారిని ముం పునుంచి బయటపడాలని కోరారు. ఈ పరిస్థితుల్లో ఒకే నాటుపడవ ఉందని, మీరు రావద్దని, మేము రాలేమని ఆ గ్రామస్థులు చెప్పడంతో ఆయన ప్రయత్నాన్ని విరమించుకున్నారని గ్రామస్తులు విలేకరులకు చెప్పారు.
 

మరిన్ని వార్తలు