పశ్చిమ గోదావరిలో పెళ్లి బస్సు బోల్తా

16 Jun, 2019 04:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అరుంధతిపేటకు చెందిన 28 మంది తెలంగాణలోని మణుగూరులో జరిగే వివాహానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్‌ నిద్ర మత్తు వలనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు