గిడ్డి ఈశ్వరికి తప్పిన ప్రమాదం

18 Nov, 2023 12:03 IST|Sakshi
ప్రమాదానికి గురైన గిడ్డి ఈశ్వరి కారు

శంఖవరం: పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న లారీని అదే మార్గంలో ఆమె ప్రయాణిస్తున్న కారు శంఖవరం మండలం సీతంపేట వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బాగా దెబ్బ తింది. ఎటువంటి గాయాలూ కాకుండా ఈ ప్రమాదం నుంచి ఈశ్వరి క్షేమంగా బయట పడ్డారు.

మరిన్ని వార్తలు