‘కేబుల్‌పై జీఎస్టీ తొలగించాలి’

18 Jul, 2018 17:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ :  కేబుల్‌పై జీఎస్టీని తొలగించాలని ఏపీ కేబుల్‌ ఆపరేటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోనేరు మురళి కృష్ట డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేబుల్‌ ఆపరేటర్ల సమస్యలపై ఈ నెల 13న ముఖ్యమంత్రిని కలిసి వివరించామన్నారు.  ఫైబర్‌ నెట్‌ కలిగి ఉన్న వారికి పోల్‌​ టాక్స్‌ వర్తించదని సీఎం హామి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నెల 19న జరిగే సమావేశంలో కేబుల సమస్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం జరిగే సభకు కేబుల్‌ ఆపరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ప్రధాన కార్యదర్శి కె.విజ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం జీఎం నెంబర్‌ 15 జారీ చేసి పోల్‌ టాక్స్‌ విధించడం కెబుల్‌ రంగానికి పెను భారంగా మారిందన్నారు. కేబుల్‌ ఆపరేటర్లను ప్రభుత్వం ఆసంఘటిత కార్మికులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం  కేబుల్‌పై జీఎస్టీని తొలగించే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. కేబుల్‌ ఆపరేటర్లకు ప్రమాద బీమా, ఇన్యూరెన్స్‌, ముద్ర పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు