అధికారులపై చంద్రబాబు అసంతృప్తి

15 Oct, 2014 12:04 IST|Sakshi
అధికారులపై చంద్రబాబు అసంతృప్తి

విశాఖపట్నం: హుదూద్ తుపాన్ సహాయక చర్యల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వ అధికారులపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్నంలో చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్బంగా వివిధ శాఖల ఉన్నతాధికారుల పనితీరుపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. నగర వాసులు నాలుగు రోజులుగా త్రాగు నీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వియషం తెలిసిందే. 

అయితే ప్రజలకు తాగునీరు ఎందుకు సరఫరా చేయలేదంటూ ఆ శాఖ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రజలకు బియ్యం పంపిణీ కూడా సజావుగా సాగడం లేదని... అందుకు సంబంధించిన చర్యలు ఎంతవరకు వచ్చాయని సదరు శాఖ ఉన్నతాధికారులను బాబు ప్రశ్నించారు.  అదికాక 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం వాసులకు సరఫరా చేయాల్సి ఉండగా పక్క జల్లాల నుంచి ఇంకా నగరానికి బియ్యం ఎందుకు చేరుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

కరెంట్ లేక ప్రజలు గత మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు... సాధ్యమైనంత త్వరగా విద్యుత్ పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. తుపాన్ బీభత్సానికి చెట్లు విరిగిపోయాయి, విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ పడి పోయాయి... వాటిని ఎంతవరకు తొలిగించారని అధికారులను చంద్రాబాబు ప్రశ్నించారు. దీనిపై అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు