చిన్న చూపేల బాబూ! 

26 Mar, 2019 07:33 IST|Sakshi
అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి నిర్మించాల్సిన ప్రాంతం

సాక్షి, అవనిగడ్డ :  ‘‘అంతన్నాడు.. ఇంతన్నాడే.. చిన్నబాబు.. నన్నొగేసెలిపోయినాడే చిన్నబాబు..’’ అంటూ దీనంగా రోదిస్తోందీ చల్లపల్లి. స్వచ్ఛ చల్లపల్లిగా ఖ్యాతి పొందిన గ్రామంలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది. గ్రామంలోని డ్రైనేజీ అధ్వానంగా దర్శనమిస్తోంది. 2016 నవంబర్‌ 11న గ్రామాన్ని సందర్శించిన అప్పటి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బైపాస్‌ రోడ్డు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి  నిర్మాణానికి నిధులిస్తామని హామీ ఇచ్చారు.

తదుపరి ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్‌ బైపాస్‌ రోడ్డుతో పాటు, మండల పరిషత్‌ కార్యాలయం నుంచి 6వ నంబరు కాలువ వరకు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి నిర్మాణానికి  రూ.2.2 కోట్లు మంజూరు చేశారు. కొంతకాలానికే గ్రామం మొత్తం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి  నిర్మిస్తామని ప్రకటించి డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు తయారు చేయమని పంచాయతీ రాజ్‌ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో రూ.11.50 కోట్లతో భారీ ప్రణాళిక రూపొందించారు.

అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. కనీసం బైపాస్‌ రోడ్డు డ్రైనేజీ అయినా అభివృద్ధి చేసి ఉంటే, గ్రామంలో కొంతమేర అయినా సమస్య పరిష్కారం జరిగుండేది. లక్ష్మీపురం కేంద్రంగా వాటర్‌ ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని చెప్పి లక్ష్మీపురంలో యుద్ధప్రాతిపదికన హెవీ బోర్లు వేయించారు. పనులు, కార్యాచరణ కానరాలేదు. దీంతో అభివృద్ధి మాటలకే పరిమితమైందని ప్రజలు పెదవి విరుస్తున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు