క్లీన్ సిటీని పరిశీలించిన ట్రెయినీ కలెక్టర్

20 Mar, 2014 03:09 IST|Sakshi

కార్పొరేషన్, న్యూస్‌లైన్ : వరంగల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న క్లీన్ సిటీ కార్యక్రమాన్ని ట్రెయినీ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ, రవాణా విధానంతో పాటు హన్మకొండలోని బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత ప్రాజెక్టు, సేంద్రియ ఎరువు తయారీ విధానం, డ్రై రిసోర్‌‌స సెంటర్‌ను సందర్శించారు. ఇందులో భాగంగా వ్యర్థాలతో బయోగ్యాస్ విద్యుత్, సేంద్రియ ఎరువు తయారీ వివరాలను ఎంహెచ్‌ఓ ధన్‌రాజ్.. ట్రెయినీ కలెక్టర్‌కు వివరించారు. ఆ తర్వాత మడికొండలోని కాకతీయ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్కు(డంపింగ్ యార్డు)ను కూడా పరిశీలించిన ఆయన శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల విధులను అడిగి తెలుసుకున్నారు.
 

మరిన్ని వార్తలు