కన్విన్స్‌ చేస్తారో.. ప్రార్థనే చేస్తారో నాకు తెలీదు

25 Jul, 2017 04:10 IST|Sakshi
కన్విన్స్‌ చేస్తారో.. ప్రార్థనే చేస్తారో నాకు తెలీదు
ముస్లిం నేతలకు సీఎం హెచ్చరిక
 
నంద్యాల: ‘మీరేం చేస్తారో నాకు తెలీదు. ప్రార్థనే చేస్తారో.. కన్విన్సే చేస్తారో.. ఓట్లన్నీ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికే పడాలి’ అని ముస్లిం పెద్దలకు సీఎం చంద్రబాబు హుకుం జారీ చేశారు. ఓట్లు వేయకుండా ఊరికే మాట్లాడితే సహించనని తెగేసి చెప్పారు. ఆదివారం సీఎం చంద్రబాబు నంద్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ తనను కలిసిన ముస్లిం పెద్దలకు సీఎం షాక్‌ ఇచ్చేలా మెలికపెట్టారు. పనులు కావాలంటే ముందు టీడీపీకి ఓట్లు వేయాలని.. ఆ తర్వాతే తనను కలవాలని ముఖ్యమంత్రి షరతు పెట్టారు. అప్పుడే కావాల్సిన పనులు చేస్తానని స్పష్టం చేశారు.

మీకున్న 56 వేల ఓట్లలో ఒక్క ఓటు కూడా వేరే వాళ్లకు వెళ్లకూడదంటూ హెచ్చరించారు. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయాలని సూచించారు. కాగా, దీనిపై ముస్లింలతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం చంద్రబాబు ఈవిధంగా అడ్డదారులు తొక్కుతుండటంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఇక అన్నీ ‘డిజిటల్‌’ స్కూళ్లే
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని అన్ని మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. విద్యా వాణి ప్రాజెక్టులో భాగంగా విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లను సీఎం సోమవారం ప్రారంభించారు.
మరిన్ని వార్తలు