రోజుకో ప్రకటనతో వంచన

20 Feb, 2015 02:29 IST|Sakshi

పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
 
పీలేరు: సీఎం చంద్రబాబు రోజుకో ప్రకటనతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. గురువారం పీలేరు లో రెండో విడత వార్డుబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు హామీలను నమ్మి, ప్రజలు ఆయనకు పట్టం కట్టారని, అయితే ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆరోపించారు. కాలు తీసి కాలుపెడితే ప్రత్యేక విమానాల్లో విహరించే సీఎం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని చెప్పుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గ్రామాల్లోని ప్రజలకు తాగడాని కి గుక్కెడు మంచినీరు దొరకక ఆహాకారాలు చే స్తున్నా ఈ ప్రభుత్వం స్పందించక పోవడడం దారుణమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు గెలిచారన్న అక్కసుతో నియోజక వర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు.

ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా, ప్రజల బాగోగులు తెలుసుకోవడం కోసం  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పల్లెబాట, వార్డు బాట కార్యక్రమాలు చేపట్టామన్నారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడం బాబు ద్వంద నీతికి నిదర్శనమన్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి  ప్రజల దాహార్తి తీవ్రతను గుర్తించి పీలేరు నియోజక వర్గానికి ఎక్కువ నిధులు కేటాయించారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ కన్వీనర్ నారే వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కే. మహితాఆనంద్, జెడ్పీటీసీ సభ్యుడు ఎం. రెడ్డిబాషా, కోఆప్షన్ సభ్యుడు ఎస్.హబీబ్ బాషా, పార్టీ నాయకులు కడప గిరిధర్‌రెడ్డి, బీడీ నారాయణరెడ్డి, ఎం.భానుప్రకాష్‌రెడ్డి, శ్రీరాములురెడ్డి, గాయం భాస్కర్‌రెడ్డి, సుంకర చక్రధర్, చామంతుల వెంకటరమణ, ఉదయ్‌కుమార్, ఎస్. గౌస్‌బాషా, ఆదినారాయణ, వీపీ. రమేష్, పూలకుమార్, ధర్మానందరెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు