సుఖంగా తెల్లవారాలంటే...

19 Apr, 2015 06:54 IST|Sakshi
సుఖంగా తెల్లవారాలంటే...

కొందరికి ప్రతిరోజూ ఉదయమే మలవిసర్జన నరకప్రాయంగా అనిపిస్తుంటుంది. ఆ పనికాస్తా సాఫీగా సాగితే రోజంతా హాయిగా ఉంటుంది. కానీ మన జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహారంలో జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటి అంశాలు మలబద్దకం సమస్యను మరింత పెంచుతున్నాయి. కేవలం రోజూ తినే పండ్లు ఇతర ఆహార పదార్థాలతోనే ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు. యాభై ఏళ్లు దాటిన ప్రతి పురుషుడికీ ప్రతిరోజూ 38 గ్రాములు, అదే మహిళ అయితే 25 గ్రాముల పీచు పదార్థాలు అవసరం. మన మలం పలచగా ఉండాలంటే పెద్దపేగులో నీరు ఉండాలి.

పీచు ఉన్న పదార్థాలు ఆహారంలో ఉంటే గనక, ఆ ఆహారం జీర్ణమై, శరీరంలోకి ఇంకే ప్రక్రియలో... ఉన్న నీరంతా పేగులు లాగేయకుండా ఈ పీచు అడ్డు పడుతుంది. అందుకే మలం మృదువుగా ఉండి, విరేచనం సాఫీగా అవుతుంది. మనం తీసుకునే ఆహారంలో కనీసం ప్రతిరోజూ 20 - 35 గ్రాముల పీచు ఉండాలి. దానికోసం స్వాభావికంగా పీచు లభ్యమయ్యే ఈ ఐదు ఆహార పదార్థాలు మీ భోజనంలో ఉండేలా చూసుకోండి.
 

మరిన్ని వార్తలు