రూ.29,800లకే అలోనెక్స్ ఇంజెక్షన్ | Sakshi
Sakshi News home page

రూ.29,800లకే అలోనెక్స్ ఇంజెక్షన్

Published Sun, Apr 19 2015 2:20 AM

రూ.29,800లకే అలోనెక్స్ ఇంజెక్షన్

మైఇలాన్ సౌలభ్యం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘నరాల్లో ఉండే మైలిన్ షిత్ పనితీరు మందగించడంతో వచ్చే వ్యాధి మల్టిపుల్ క్లిరోసిస్. దీనికి క్లినికల్ థెరపీ చేసిన తర్వాత వైద్యులు సూచించే మందు అలోనెక్స్ ఇంజెక్షన్. దీని ధర బయటి మార్కెట్లో దాదాపు రూ.40 వేలుంటుంది. కానీ, myelan.in లో మాత్రం కేవలం రూ.29,800కే దొరుకుతుం దని’’ ఇలాన్ క్రిటికల్ కేర్ ఎండీ కే శేఖర్ చెప్పారు. శనివారమిక్కడ ఇలాన్ క్రిటికల్ కేర్ సంస్థను, myelan.inను మంత్రి సీ లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సంస్థ ఎండీ శేఖర్ మాట్లాడారు. కిడ్నీ, మెదడు, గుండె, నరాల సంబంధిత వ్యాధులకు సంబంధించిన క్లినికల్ థెరపీ (ఈ థెరపీ చేయించుకున్న వాళ్లు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది) మందులు అన్ని మెడికల్ దుకాణాల్లో దొరకవు. ఎందుకంటే వీటిని 2-8 సెంటిగ్రేడ్ల చల్లని ప్రాంతంలో నిల్వ చేయాల్సి ఉంటుంది. అందుకే అన్ని మెడికల్ షాపుల వాళ్లు వీటిని విక్రయించరు. దీంతో వీటి ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే రూ.80 లక్షల పెట్టుబడితో ఇలాన్ క్రిటికల్ కేర్ సంస్థను స్థాపించాం.

ఇక్కడ ప్రత్యేకంగా రూపొందించిన కోల్డ్ రూమ్‌లో మందులను నిల్వ చేస్తాం. ఇక్కడి నుంచి ఆర్డర్‌పై 30-40% రాయితీ ద్వారా మందులను సరఫరా చేస్తాం. హైదరాబాద్ పరిధిలో అయితే మందులను ఇంటికి సరఫరా చేస్తాం. ఇతర నగరాలకైతే 24 గంటల్లోగా కొరియర్ ద్వారా పంపిస్తాం. క్లినికల్ థెరపీ మందులను తయారు చేసే సుమారు 40 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. వీటిలో అబాట్ హెల్త్ కేర్, అన్‌థమ్ బయోఫార్మా, ఆస్ట్రాజెనీకా, బాక్స్‌టర్ ఇండియా ప్రై.లి., డాక్టర్ రెడ్డీస్, గ్లాక్సో, గ్లెన్‌మార్క్ ఫార్మా వంటివి ఉన్నాయి. వచ్చే 6 నెలల్లో విజయవాడలో మరో సంస్థను, రెండేళ్లలో క్లినికల్ థెరపీ మందులను తయారు చేసే ప్లాంట్‌ను నెలకొల్పుతామన్నారు.

Advertisement
Advertisement