శానిటైజర్ల తయారీలో డిస్టిలరీలు

28 Mar, 2020 05:02 IST|Sakshi

లైసెన్స్‌లు మంజూరు చేసిన ఎక్సైజ్‌శాఖ

ఇప్పటికే నాలుగు డిస్టిలరీల్లో ఉత్పత్తి ప్రారంభం

సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో శానిటైజర్ల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాటి తయారీ కోసం డిస్టిలరీలకూ ఎక్సైజ్‌ శాఖ లైసెన్సులు మంజూరు చేసింది.  
- రాష్ట్రంలో 17 డిస్టిలరీలున్నాయి. వీటన్నిటికీ శానిటైజర్లను తయారు చేసేందుకు లైసెన్సులు మంజూరు చేశారు. వాటిలో నాలుగు డిస్టిలరీలు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయి.
- శానిటైజర్ల తయారీకి దరఖాస్తు చేసుకున్న ఫార్మా కంపెనీలకూ కొత్తగా 10 లైసెన్సులిచ్చారు. 
- రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ను మద్యం డిస్టిలరీలు తయారు చేస్తాయి. శానిటైజర్‌ తయారు చేయాలంటే ఈ రెక్టిఫైడ్‌ స్పిరిట్‌(ఆర్‌ఎస్‌)దే ప్రాధాన్యం. 
- రెక్టిఫైడ్‌ స్పిరిట్‌లో ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్, ఇథనాల్‌ ఉంటాయి. వీటినే శానిటైజర్‌కు వాడతారు.
- రాష్ట్రంలో ఫార్మా కంపెనీలకు రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ వాడేందుకు అనుమతి ఉండదు. దీన్ని వాడాలంటే ఆర్‌ఎస్‌–3 లైసెన్స్‌ పొందాల్సి ఉంటుంది

రెండు గంటల్లోపే లైసెన్స్‌ ఇస్తున్నాం.. 
శానిటైజర్ల తయారీకి రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ కావాలని ఎవరు దరఖాస్తు చేసుకున్నా రెండు గంటల్లోపే అనుమతులిస్తున్నాం. డిస్టిలరీలు శానిటైజర్లను తయారుచేసి మార్కెట్లోకి తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చేలా ఆదేశాలిచ్చాం. 
– వాసుదేవరెడ్డి, కమిషనర్‌ ఆఫ్‌ డిస్టిలరీస్‌ అండ్‌ బ్రూవరీస్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా