డీసెట్‌ గడువు పెంపు

12 Apr, 2018 09:56 IST|Sakshi
మంత్రి గంటా శ్రీనివాస రావు(పాత చిత్రం)

అమరావతి : డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీసెట్‌) గడువు ఈ నెల 24 వరకు పెంచుతున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ.. నిజానికి డీసెట్‌ దరఖాస్తుల గడువు గురువారంతో ముగిసిందని, కానీ విద్యార్థుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవ‌త్సర ప‌రీక్షా ఫ‌లితాలు గురువారం విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే డీసెట్‌ పరీక్ష గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ డీసెట్‌కు అందిన దరఖాస్తులు 31,610.  ఆన్‌లైన్‌లో ఈ నెల సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు