బాబూ..మీరు మళ్లీ ఎందుకు రావాలి?

23 Oct, 2019 12:21 IST|Sakshi
మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి  

మీ పాలనలో అంతా కరువే

రైతు రుణమాఫీ పేరుతో వంచన

సెంటు భూమి నిరుపేదకు ఇవ్వలేదు

మీరు ఎందుకు మళ్లీ రావాలో ప్రజలకు జవాబు చెప్పాలి

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రశ్నల వర్షం

సాక్షి, పుత్తూరు : ‘నేడు సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి.. పల్లెలు పచ్చదనంతో పరిమళిస్తున్నా యి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో సహా గ్రామాల్లోని చెరువులు సైతం నిండుకుండలను తలపిస్తున్నాయి. రైతన్న కాడిని భుజానికెత్తుకుని సంతోషంగా పొలానికి వెళుతున్నాడు. ఐదేళ్ల మీ పాలనలో భూములు బీళ్లు వారాయి. కరువు రక్కసి కరాళనృత్యం చేసింది. తాగునీటికి అలమటించాల్సిన దుస్థితి ఏర్పడింది. సాగుకు నీరు లేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. మళ్లీ మీరు రావాలని, కరువు కావాలని రాష్ట్ర ప్ర జలు కోరుకుంటున్నారా’ అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ప్ర శ్నలు వర్షం కురిపించారు. మంగళవారం పు త్తూరులోని స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సోమవారం శ్రీకాకుళంలో చంద్రబాబునాయుడు ‘మళ్లీ నేను రావాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అని చేసిన వ్యా ఖ్యలపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్పందించారు.

‘ప్రతి రైతుకు రైతు భరోసా కింద రూ.13,500 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్నారు.. రైతు రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి వంచించినందుకు ఏ రైతు అయినా మీరు మళ్లీ రావాలని కోరుకుం టున్నారా.., అమ్మ ఒడి పథకం కింద పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి రూ.15 వేలు సీఎం వైఎస్‌ జగన్‌ అందించనున్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలకు విద్యారంగాన్ని ధారాదత్తం చేసినందుకు ఏ విద్యార్థి తల్లిదండ్రులైనా మీరు మళ్లీ రావాలని అనుకుంటున్నారా.. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు మం జూరు చేయకుండా భవిష్యత్తుతో చెలగాటమాడినందుకు ఏ విద్యార్థి అయినా మళ్లీ మీరు రావాలని కోరుకుంటారా? అని ప్రశ్నిం చారు. రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కానుక ఇచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు దిశగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ప్రతి మహిళ మోములో చిరునవ్వు చూస్తున్నారు.

మద్యం వ్యాపారం పేరుతో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు దుకాణాలను నడపడమే కాకుండా గ్రామ గ్రామానా, వీధుల్లో, సందుల్లో సైతం బెల్టు దుకా ణాలు ఏర్పాటు చేసి కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసినందుకు ఏ మహిళ అయినా మీరు మళ్లీ రావాలని కోరుకుంటున్నారా.. రాష్ట్రంలో ఉండే ప్రతి పేద కుటుంబానికి రా నున్న ఉగాది పండుగ రోజు ఇంటి పట్టాలు పం పిణీకి ముఖ్యమంత్రి సర్వం సిద్ధం చేస్తున్నారు. మీ హయాంలో ఒకటిన్నర సెంటు భూమి పేదవాడికి ఇచ్చేందుకు మనసు రాని మీరు మళ్లీ రావాలని ఏ నిరుపేద అయినా అనుకుం టారా..?, స్విమ్స్‌లో మెడికల్‌ షాపులు మొదలు   పోలవరం, రాజధాని, విశాఖ భూకుంభకోణం వరకు, ఆఖరుకు టీటీడీలో డ్రైక్లీనింగ్‌ దుకాణం వరకు రాష్ట్ర సంపదను బంధువర్గానికి, అస్మదీయులకు దోచి పెట్టినందుకు మళ్లీ మీరు రా వాలని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారో సమాధానం చెప్పాలి’  అని చంద్రబాబునాయుడుకు నారాయణస్వామి సవాలు విసిరారు. 

మరిన్ని వార్తలు