కుప్పంలో మళ్లీ ఏనుగుల బీభత్సం

2 Jan, 2014 20:38 IST|Sakshi

చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో ఏనుగులు మళ్లీ బీభత్సం సృష్టించాయి. వేపలవల్లి గ్రామ శివారు ప్రాంతంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించడంతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కుప్పం వేపలపల్లి వద్ద రోడ్డుపైన 21 ఏనుగులు విడిది చేశాయి. వాటిని గమనించిన స్థానికులు ఉరుకులు పరుగులతో గ్రామంలోకి చేరుకున్నారు. గ్రామ శివారులోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు బిగ్గరగా ఘీంకరిస్తూ పంట పోలాల్లోకి వెళ్లాయి. అక్కడి పంటపోలాలను ఏనుగుల మంద నాశనం చేసినట్టు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సకాలంలో అప్రమత్తమయ్యారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు నానాకష్టాలు పడ్డారు. ఆ రోడ్డుమార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసినట్టు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు