‘క్యూల’ అధ్యయనం చకచకా

3 Jul, 2014 01:31 IST|Sakshi
‘క్యూల’ అధ్యయనం చకచకా

తిరుమల : తిరుమలకు వచ్చే యాత్రికులు వేంకటేశ్వరస్వామిని సంతృప్తికరంగా దర్శించుకునే అవకాశం కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై బుధవారం కూడా అధ్యయనం కొనసాగింది. టీటీడీ జేఈవో కేఎస్‌శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తదితర అధికారులు  వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో తనిఖీ చేశారు. అక్కడే  సమావేశమై విధి విధానాలపై చర్చించారు. సర్వదర్శనం, కాలిబాట దర్శనం, రూ.300 టికెట్ల దర్శనం, చంటి బిడ్డ తల్లిదండ్రుల దర్శనం, ఆర్జిత సేవల భక్తులు..

ఇలా  ఏ రోజు ఎంతమంది భక్తులు వస్తున్నారు? ఏయే క్యూలలో ఎంతమేర వత్తిడి ఉంది? అన్న విషయాలను గుర్తించి రికార్డు చేశారు.  రద్దీ తక్కువ వేళ క్యూ నడిచే విధానాన్ని, గంటకు ఎంత మందికి గర్భాలయ మూలమూర్తి దర్శన భాగ్యం కలిగింది? వంటి వివరాలతో ప్రత్యేకంగా మ్యాపు సిద్ధం చేశారు. వీటి ఆధారంగా స్వల్ప మార్పులు చేసి వాటిని అమలు చేయాలని ఆలయ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
 

>
మరిన్ని వార్తలు