ప్రజల మదిలో జగన్‌కు సుస్థిర స్థానం: ద్రోణంరాజు

15 Jul, 2019 08:30 IST|Sakshi
 ద్రోణంరాజు శ్రీనివాస్‌ను సన్మానిస్తున్న వంశీకృష్ణశ్రీనివాస్, నాగిరెడ్డి, మళ్ల తదితరులు

నెలరోజుల్లోనే తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు

నాకు రాజకీయంగా సీఎం జగన్‌ పునర్జన్మ ఇచ్చారు

వీఎంఆర్‌డీఏ చైర్మన్‌    ద్రోణంరాజు శ్రీనివాస్‌ 

జీవీఎంసీ పీఠాన్ని కానుకగా ఇద్దామని పిలుపు

సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్పయాత్ర లాం టి మహాయజ్ఞాన్ని పూర్తిచేసి తండ్రికి తగ్గ తనయుడిగా..ఎన్నికల్లో భారీ విజయం సాధించి నెలరోజుల పాలనతో తండ్రిని మించిన తనయుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ అన్నారు. మూడు దశాబ్దాలుగా రాజకీయ చరి త్ర ఉన్న తనకు  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజకీ య పునర్జన్మ ఇచ్చారని ఉద్వేగానికి లోనయ్యా రు. మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ద్రోణం రాజు సత్కార సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతటా ప్రభంజనం సృష్టించినా.. విశాఖ నగరంలో నాలుగు నియోజకవర్గాల్లో ఓడిపోవడం విచారకరమన్నారు. రానున్న ఎన్నికల్లో నగరపాలక సంస్థను కైవసం చేసుకుని సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.

జీవితాంతం రుణపడి ఉంటా
తనను నమ్మి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానం కల్పించారు. ఓటమి చెందినా నా మీద విశ్వాసంతో వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా నియమించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానన్నా రు.  వైఎస్‌ కుటుంబం నమ్మినవారిని మోసం చేయదని, దానికి తానే నిదర్శనమని కొనియాడారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డితో తన తండ్రి సత్యనారాయణకు గొప్ప అనుబంధం ఉండేదన్నారు. అలాగే తాను వైఎస్సార్‌సీపీలో చేరినపుడు జగన్‌మోహన్‌రెడ్డికి  ఒకే ఒక మాట ఇచ్చానని చెప్పారు. ఇక నుంచి మీ శత్రువు నాకూ శత్రువే..మీ మిత్రుడు నాకూ మిత్రుడే.. మీ అజెండానే నా అజెండాగా పార్టీలో చేరుతున్నానన్నానని.. ఊపిరి ఉన్నంతవరకు వైఎస్సార్‌సీపీ అభివృద్ధికి పాటుపడతానని ఇచ్చిన మాటను ఈ సందర్భంగా ద్రోణం రాజు గుర్తు చేసుకున్నారు.


మాట్లాడుతున్న వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌
 

పార్టీకోసం కష్టపడిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని చెప్పారు. విశా ఖ నగర పరిధిలో టీడీపీని భూ స్థాపితం చేయడానికి అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.  నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్‌ మాట్లాడుతూ చిత్తశుద్ధితో ఎవరైతే పార్టీకోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు దక్కుతుందన్నారు. రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించి జగనన్నకు కానుక ఇద్దామని పిలుపునిచ్చారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో కొత్త ఒరవడి తెచ్చిన నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని, ఆయన రూపొందించిన ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, 108, 104 సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అట్టవర్గాలకు అండగా నిలిచిరాని కొని యాడారు.  ఇప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వాటికి పూర్వ వైభవం తేవడానికి కృషి చేయడంతో పాటు మరిన్ని పథకాలు ప్రవేశ పెట్టి తండ్రిని మించిన తనయుడిగా నిలుస్తున్నారన్నారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, కుం భారవిబాబు, సమన్వయకర్తలు కేకే రాజు, అక్కరమానివిజయనిర్మల, డీసీసీబీ చైర్మన్‌ సుకుమారవర్మ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కోలాగురువులు, రాష్ట్ర కార్యదర్శి సత్తి రామకృష్ణారెడ్డి, ఉరుకూటి అప్పారావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, జాన్‌వెస్లీ, అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పక్కిదివాకర్, నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బెహరా భాస్కర్, పార్టీ ముఖ్యనాయకులు ఐహెచ్‌ పరూఖీ, బోని శివరామకృష్ణ, పి.ఉమారాణి, గరి కిన గౌరి, కె.రామన్నపాత్రుడు, శ్రీనివాస్‌ గౌడ్, యువశ్రీ, అజయ్‌కుమార్, రెయ్యి వెంకటరమణ, బాకి శ్యామ్‌కుమార్‌రెడ్డి, కలి దిండి బద్రి నాథ్, కాళి దాసురెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు అల్లంపల్లి రాజుబాబు, శ్రీదేవివర్మ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు