ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యుత్ ‘కట్’కటలు

21 Feb, 2014 23:26 IST|Sakshi

షాబాద్, న్యూస్‌లైన్:  దివంగత మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ రాచమల్ల సిద్ధేశ్వర్ అన్నారు. మండలంలోని సోలీపేట్ గ్రామంలో శుక్రవారం గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంటు కోతలతో రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పి కనీసం మూడు గంటలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా విస్మరించిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఏండీ ఖాజాపాషా,  వెంకటేశ్‌గౌడ్, మద్దూర్ మాజీ సర్పంచ్ రెడ్యానాయక్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

 గ్రామకమిటీ ఎన్నిక
 సోలీపేట వైఎస్సార్ సీపీ మండల కార్యద ర్శిగా జోన్నగారి దేవేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గొల్లపల్లి దేవేందర్‌రెడ్డి, కార్యదర్శులుగా రాములు, రాంరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా కోటేశ్వర్‌రెడ్డి, జంగయ్య, కోషాధికారిగా హరికిషన్‌రెడ్డి, సభ్యులుగా కృష్ణ, ఆంజనేయులు, రంగయ్య, మహేందర్, నవీన్, యాదయ్య ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు