ఆర్థిక అంశాలు చాలా కీలకం

30 Jun, 2013 11:00 IST|Sakshi

 కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గణాంకాల సమాచారం ఆధారంగానే ఉన్నత అధికారులు సామాజిక, ఆర్థిక అంశాల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. కలెక్టరేట్‌లోని సభా భవనంలో శనివారం జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణాంకశాస్త్ర విభాగానికి విశిష్ఠ స్థానం ఉందన్నారు. పలు ప్రతిష్ఠాత్మక సంస్థలకు రూపకల్పన చేసిన ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త మహలనోబిస్ జన్మదినం జులై 29న జాతీయ గణాంక దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు.

ఆ మహానీయుడిని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని యువతకు సూచించారు. గణాంక శాస్త్రాభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. పాలనాపరంగా కొత్తకొత్త పద్ధతులు వచ్చాయని.. అందుకు తగ్గట్టు మనం మన పనితీరును మార్చుకోవాలన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానంపై దృష్టిసారించాలన్నారు. సీపీఓ తిప్పేస్వామి మాట్లాడారు. తొలుత గణాంక శాస్త్రవేత్త మహలనోబిస్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన గావించారు. ఏఎన్‌ఓలు, సీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు